ఎఫ్ టీసీసీ అవార్డు మరింత ఉత్తేజాన్ని నింపింది…
ఎఫ్ టీసీసీ అవార్డు మరింత ఉత్తేజాన్ని నింపింది…
బాయన బాబుజి (బాబ్జి)
భవానిపురం, ఆంధ్రప్రభ : ఎఫ్ టి పి సి ఇండియా (ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కంట్రోల్ ఆఫ్ ఇండియా )అవార్డు మరింత ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపిందని ఏపీ నగరాల సంఘం అధ్యక్షులు బాయన బాబుజి (బాబ్జి)అన్నారు.ఈ మేరకు ఆదివారం మీడియా ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో నగరాల అభివృద్ధి, సంక్షేమం కోసం శ్రమించడంతోపాటు, రాష్ట్ర నగరాల సంఘం అధ్యక్షులుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకుగాను ఎఫ్ టి పి సి ఇండియా వారు గుర్తించి అవార్డు ఇవ్వడం తనకు మరింత ఉత్తేజాన్ని కలిగించిందని అన్నారు.
ఈ అవార్డును ఈగల్ ఐజి రవి కృష్ణ చేతుల మీదుగా తీసుకోవడం మంచి అనుభూతిని కలిగించిందని అన్నారు. ఎఫ్ టి పి సి ఇండియా దేశంలో అనేక అనేక రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి గుర్తించి వారిని ఉత్తేజపరిచే విధంగా వారిని ప్రోత్సహించి వారి నుండి మరింత సేవలు సమాజానికి అందించే విధంగా కృషి చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఎఫ్ టి పి సి ఇండియా అధ్యక్షులు జంగా చైతన్య సెక్రటరీ పివిఎస్ వర్మా తన సేవలను గుర్తించి తనను ప్రోత్సహిస్తూ అవార్డును ప్రకటించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఎఫ్ టి పి సి ఇండియా టీంకు ధన్యవాదాలు తెలిపారు.
