tamannaah | తళుక్కుమంటున్న తమన్నా..
tamannaah | తళుక్కుమంటున్న తమన్నా..
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : స్టైలిష్ లుక్స్‌తో ఫ్యాషన్ ప్రియులను.. పవర్ఫుల్ పాత్రలతో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా తన ప్రస్థానాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తోంది. అటు సినిమాల పరంగా, ఇటు ఫ్యాషన్ ప్రపంచంలోనూ తనదైన ముద్ర వేస్తూ ఈ మిల్కీ బ్యూటీ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. తమన్నా భాటియా తనదైన అందం.. అభినయంతో రెండు దశాబ్ధాల కాలంగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. కేవలం వెండితెరపైనే కాకుండా, ఫ్యాషన్ ప్రపంచంలోనూ తమన్నా తనదైన ముద్ర వేస్తోంది. మిల్కీ గ్లామర్ చూస్తుంటే ఇప్పటికీ కాలేజీ అమ్మాయిలాగే ఉందంటూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ప్రస్తుతం సినిమాల విషయానికి వస్తే పురుషన్, షాహిద్ తో ఓ రోమియో, అజయ్ దేవగన్ తో రేంజర్ చిత్రాల్లో నటిస్తోంది. వివాన్ - ఫోర్స్ ఆఫ్ ద ఫారెస్ట్ షూటింగ్ దశలో ఉంది. ఈ ప్రాజెక్టులపై మంచి అంచనాలు ఉన్నాయి. సినిమాలతో పాటు నెట్‌ఫ్లిక్స్ , హాట్‌స్టార్ వంటి ప్రముఖ ఓటిటి సంస్థల కోసం కొన్ని ఆసక్తికరమైన వెబ్ ఒరిజినల్స్‌లో నటించనున్నారని సమాచారం. వీటితో పాటు కొన్ని భారీ బడ్జెట్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ ద్వారా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారట.





















