ఏడు లారీల్లో డీజిల్ చోరీ

ఏడు లారీల్లో డీజిల్ చోరీ
- ఓనర్లు, డ్రైవర్లలో ఆందోళన
- 350 లీటర్ల డీజిల్ దొంగిలింపు
- భద్రతపై ప్రశ్నలు
చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని పాత మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న లారీ అసోసియేషన్ వద్ద భారీ డీజిల్ చోరీ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఏడు లారీల డీజిల్ ట్యాంకులను పగులగొట్టి సుమారు 350 లీటర్ల డీజిల్ దొంగిలించినట్లు లారీ అసోసియేషన్ అధ్యక్షుడు దానవేణ రమేష్ తెలిపారు.

మండల కేంద్రంలో లారీ అసోసియేషన్ ఏర్పాటు చేసి పాత మార్కెట్ సమీపంలో లారీలను నిలిపి వివిధ అవసరాల కోసం వినియోగిస్తుంటారని చెప్పారు. అయితే శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ నిలిపి ఉంచిన లారీల్లోని డీజిల్‌ను చోరీ చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనతో లారీ ఓనర్లు, డ్రైవర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు తగిన భద్రతా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
