ప్రతి అర్జీపై బాధ్యతాయుత చర్యలు

ప్రతి అర్జీపై బాధ్యతాయుత చర్యలు

సెంట్రల్ బొండా ఉమామహేశ్వరరావు

పాయకాపురం,ఆంధ్ర ప్రభ : ప్రతి అర్జీపై బాధ్యతాయుత చర్యలు ఉంటాయని సెంట్రల్ బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.సింగ్ నగర్‌లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ప్రజల సమస్యల స్వీకరణ పరిష్కారాల కోసం ప్రజాదర్బార్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం లక్ష్యంగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం నిత్యం పనిచేస్తోందని తెలిపారు.

ప్రతి శుక్రవారం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో గ్రీవెన్స్ డేగా ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, ప్రజలు తమ కష్టాలు, అవసరాలను నేరుగా ఎమ్మెల్యేలు, ఎంపీల దృష్టికి తీసుకురావడానికి ఇది ఒక ముఖ్యమైన వేదికగా మారిందని పేర్కొన్నారు.స్థానిక62వ డివిజన్ టీడీపీ కమిటీకి డివిజన్ ఇంచార్జి పైడి శ్రీను మాజీ కార్పొరేటర్ తులసి ఆధ్వర్యంలో మహిళలకు ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చీరలు పంపిణీ చేశారు.స్థానిక63వ డివిజన్ ఆటో కార్మికుడి కి ఎమ్మెల్యే బొండా ఉమా సహకారంతో ఆటోను వాయిదా పద్దతిలో ఈ.ఎమ్.ఐ కట్టుకునే విధంగా బొండా ఉమామహేశ్వరరావు అందజేశారు.

ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్,61వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు ఆకుల సూర్యప్రకాష్,పార్లమెంట్ కార్యదర్శి గౌసియా, స్వర్ణాంధ్ర 2026 టీమ్, సచివాలయ అడ్మిన్స్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.