అన్ని రంగాలను విస్మరించిన బడ్జెట్

అన్ని రంగాలను విస్మరించిన బడ్జెట్

అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ అన్ని రంగాలను విస్మరించినట్లే ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ పై అర్బన్ ఎమ్మెల్యే ధన్పా ల్ సూర్యనారాయణ మాట్లాడారు. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా అంకెల గారడి ప్రదర్శించారని విమ ర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెర వేర్చకుండా సమ యం వృధా చేస్తున్నారన్నా రు. మహిళలకు, విక లాంగులకు పెంచుతా మన్న పింఛను మాటే తీయలేదన్నారు.

నిరు ద్యోగ భృతి, ఉద్యోగుల పీఆర్సీ కొరకు నిధులు కేటాయించలేరని చెప్పారు. ఇప్పటికే హామీలు నెరవేర్చ కుండా మోసం చేసిన ప్రభుత్వం..ఇప్పుడు అంకెల గారడీతో మళ్ళీ మోసం చేసిందన్నారు. వీరికి కూడా గత ప్రభు త్వానికి పట్టిన గతే పడుతుందన్నారు. స్కిల్ యూనివర్సిటీని విద్యాశాఖ పరిధిలోకి తీసుకొస్తానంటూ రెం డేళ్లుగా విస్మరిస్తు న్నా రని, రాష్ట్రంలో కనీసం విద్యాశాఖ మంత్రి కూ డా లేరని తెలిపారు.

రెండేళ్లుగా సిడీపీ కింద రావాల్సిన నిధులే ఇవ్వలేదని, ఇక ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయిస్తామంటే ఎలా నమ్ముతారన్నారు. ప్రస్తుత బడ్జెట్ పరిశీలిస్తే పేపర్ మీద గ్రాండ్ గా ఉందని కానీ గ్రౌండ్లో మాత్రం బ్లాంక్ గానే ఉందన్నారు.

Leave a Reply