కొండా లక్ష్మణ్ బాపూజీ డాక్యుమెంటరీ చిత్రానికి గద్దర్ అవార్డు

కొండా లక్ష్మణ్ బాపూజీ డాక్యుమెంటరీ చిత్రానికి గద్దర్ అవార్డు

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిలింఫేర్ అవార్డు ద్వితీయ సంవత్సర గద్దర్ పేరు మీద ఇచ్చే అవార్డు మొట్ట మొదటిసారిగా తెలంగాణ ఉద్యమకారుడు, పద్మశాలి ముద్దుబిడ్డ స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ డాక్యుమెంటరీ చిత్రానికి దక్కింది.

ఈ చిత్రాన్ని నిర్మించిన చిరందాసు ధనంజయ తో పాటు చిత్రం యూనిట్ ప్రతిభను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గోల్డెన్ మెమొంటో, ప్రశంసాపత్రం, ఐదు లక్ష రూపాయలు నగదును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఫిలిం ఫెడరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా అందజేశారు. చిత్ర యూనిట్ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందజేసినందుకు చిత్ర యూనిట్ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.