చిట్యాలలో ఎమ్మెల్యే వీరేశంకు ఘన సత్కారం

చిట్యాల, ఆంధ్రప్రభ : నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను ప్రభుత్వం విప్‌గా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో శుక్రవారం నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలోని చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్, నకిరేకల్‌లోని ఎమ్మెల్యే నివాసంలో వేముల వీరేశంను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశంకు పూల బొకే అందించి, శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న కైలాస్, చిట్యాల మాజీ మార్కెట్ చైర్మన్ పందిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply