Cat | పాపం డిగ్రీ చదువుతున్న యువతి…

Cat | పాపం డిగ్రీ చదువుతున్న యువతి…
Cat | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పెంపుడు పిల్లి (Cat) చనిపోయిందనే విషయాన్ని తట్టుకోలేక డిగ్రీ చదువుతున్న యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన నగరంలోని మీర్ పేట్ (Meerpet) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీస్ స్టేషన్ పరిధిలో బడంగ్ పేట్, వెంకటాద్రి నివాస్ కు చెందిన హిమబిందు(20) గత రెండు సంవత్సరాలుగా ఎంతో ఇష్టంగా పెంచుకున్న పెంపుడు పిల్లి (Cat) మృతిని తట్టుకోలేక పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.
మీర్ పేట్ పోలీసులకు సమాచారం తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
