ఉగాది రోజు ఇలా చేస్తే ఏడాదంతా లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుంది..

ఊర్కొండ, ఆంధ్రప్రభ : నాడు తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పండుగను జరుపు ఉంటున్నాం .ఉగాది రోజున ఏ దేవుడినైనా పూజించవచ్చు, కానీ ముఖ్యంగా లక్ష్మీదేవిని,విష్ణుమూర్తిని పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయయాని శ్రీ పబ్బాతి ఆంజనేయ స్వామి దేవాలయ అర్చకులు సిరివెల్లి దత్తాత్రేయ శర్మ అన్నారు. ప్రజలందరికీ పరా భవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఉగాదిని ప్రజలందరూ కూడా హిందూ సాంప్రదాయ ప్రకారంగా పరాభవ నామ సంవత్సరమును జరుపుకుంటారు.

షష్టి సంవత్సరాలలో ఈ పరాభవ నామ సంవత్సరం 40వ సంవత్సరం. ఈ సంవత్సరంలో పంచాంగ శ్రవణం ఉంటుంది ప్రజలందరూ కూడా సాయంత్రం వేళలో గ్రామములలో సాయంత్రము పంచాంగ శ్రవణం జరుపుకుంటారు. ఈ సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా ఉన్నాయి నల్ల రేగడి తెల్ల భూములు నల్ల భూములు సమృద్ధిగా పంటలు పండును పశువుల సమృద్ధిగా పాలిచ్చెను పసిపాలకుడు గోపాలుడు పశువుల కాపరి కూడా గోపాలుడు కాబట్టి పశువుల సమృద్ధిగా పాల నిచ్చును ఈ పరాభవనామ సంవత్సరములో నవ నాయకులలో ఏడుగురు శుభులు అగుటవలన ఈ సంవత్సరము అంతా అన్ని విధాల క్షేమంగా ఉంది
మొదలు….. పండుగ పూట
తలస్నానం చేసి, పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం ఆనవాయితీ. తలకు, శరీరానికి నువ్వుల నూనె రాసుకుని అభ్యంగన స్నానం చేయడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది. ఇంటి గుమ్మానికి పసుపు, కుంకుమ పెట్టి మామిడి తోరణాలతో అలంకరించాలి. మామిడి తోరణాలు నెగటివ్ ఎనర్జీని తొలగించి దైవాకర్షణను పెంచుతాయి. పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకుని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. పూజ గదిలో బియ్యప్పిండితో ముగ్గు వేసి దీపారాధన చేయాలి.

ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య ఇంట్లో పూజ చేసుకోవడం అత్యంత శుభప్రదం. ఉగాది రోజున పాలు పొంగించి, ఆ పాలతో పాయసం తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుందని ఒక అపారమైన నమ్మకం. పూజలో పసుపుతో చేసిన చిన్న గణపతిని పూజిస్తే సంవత్సరమంతా పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు లభిస్తాయి. ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. పూజలో మీ పేరు, గోత్రం చెప్పుకుని కుటుంబం బాగుండాలని సంకల్పం చెప్పుకోవాలి.
అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు
షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని (బెల్లం, చింతపండు, వేప పువ్వులు, పచ్చి మామిడి ముక్కలు, ఉప్పు, కారం) తయారు చేసి, దేవునికి నైవేద్యంగా సమర్పించి కుటుంబ సభ్యులంతా స్వీకరించాలి. ఉగాది పచ్చడిని తయారు చేసే ఆడవారు ఉదయం ఉపవాసం ఉండి, పూజ పూర్తయిన తర్వాతనే స్వీకరించాలి.

కొత్త మట్టికుండలో ఉగాది పచ్చడిని తయారు చేయడం అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలను ఇస్తుంది. గోమాతలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి, ఉగాది రోజున గోమాతకు అరటి పండ్లు లేదా పచ్చి గడ్డిని ఆహారంగా తినిపించడం వల్ల పాపాలు తొలగి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది.

నూతన పంచాంగాన్ని కొని పూజ గదిలో దేవుని చిత్రపటాల వద్ద ఉంచి పూజిస్తే గ్రహదోషాలు లేకుండా ఐశ్వర్యం కలిసి వస్తుంది. రాళ్ల ఉప్పుతో ఐశ్వర్య దీపం వెలిగించడం వల్ల ఇంట్లోని దారిద్ర్య బాధలు తొలగి మహాలక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది.

ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయను కట్టుకోవడం నరపీడను తొలగించి మహాలక్ష్మి కటాక్షాన్ని అందిస్తుంది. వివాహమైన ఆడవారు తులసికోటలో నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేస్తే దీర్ఘసుమంగళీ యోగం కలుగుతుంది. ఐదుగురు ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలం ఇవ్వడం వల్ల కుటుంబానికి మంచి జరుగుతుంది.

అనవసరపు ఖర్చులు తగ్గించుకోవడానికి బీరువాలో లేదా పర్సులో పచ్చ కర్పూరం పెట్టుకోవాలి. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం వల్ల ఆయురారోగ్యాలు, విజయాలు కలుగుతాయి. స్తోమతను బట్టి పేదవారికి దానం చేయడం రెట్టింపు పుణ్యఫలితాన్నిస్తుంది. ఉగాది రోజున ప్రతి నిమిషం శుభముహూర్తమే కాబట్టి, కొత్త పనులు ప్రారంభిస్తే ఆటంకాలు లేకుండా విజయవంతమవుతాయి.

ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు పూజ గదిలో కుబేర ముగ్గు వేసి దీపం వెలిగిస్తే ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. దేవాలయ సందర్శనం, గణపతికి గరిక సమర్పించడం ద్వారా శుభాలు కలుగుతాయి. బ్రాహ్మణులకు మట్టికుండ దానం చేస్తే ధనధాన్యాలకు కొరత ఉండదు. ఇలా చేయడం వల్ల దేవాది దేవతల ఆశీర్వాదాలు భక్తులపై ఉంటుంది.

Leave a Reply