19thMarchCartoon| ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

19thMarchCartoon| ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
19thMarchCartoon | ఆంధ్రప్రభ ఉగాది శుభాకాంక్షలు
నగరీకరణతో మారుతున్న జీవనశైలి
కోయిలల బాథలో దాగిన వాస్తవం
ఆంధ్రప్రభ పాఠకులందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
ప్రతిరోజూ ఔరా కార్టూన్ తో అలరించే ఆంధ్రప్రభ పండగలకు మరింత ప్రత్యేక కార్టూన్లను అందిస్తూ మరింతగా అలరిస్తోంది. సమకాలీన సామాజిక, రాజకీయ పరిణామాలపై వ్యంగ్యాస్త్రాలను సంధిస్తూనే, పండగ ప్రత్యేకతలను ఆ కార్టూన్లలో ఇనుమడిస్తోంది. అదే క్రమంలో అందిస్తోన్న ఔరా కార్టూన్ ఇది.

అభివృద్ధి పేరుతో జరుగుతోన్న నగరీకరణ మన సహజమైన జీవనశైలికి దూరం చేస్తోంది. పండుగలు అంటే ప్రత్యేకమైన కార్యక్రమాల పేరిట వెకిలి హాస్య ప్రోగ్రాంస్ టీవీల్లో చూస్తూ గడిపేసి, పండగ అంటే అదే అనుకునే రోజులొచ్చాయి. ఒకప్పుడు ఉగాది అంటే ఎలా ఉండేది…ఇప్పుడెలా ఉంది…అసలు పొంతనే లేదు కదూ…
ఇక ఈ కార్టూన్ విషయానికొస్తే…నగరీకరణ కాస్తా ఆకాశహర్మ్యాల రూపంలో మరింత విస్తరిస్తోంది…పదులకొద్దీ అంతస్థులతో నిర్మిస్తోన్న హై రైజ్ అపార్ట్ మెంట్లలో నివసించడం ఇప్పుడు స్టేటస్…
పాపం…తమ కమ్మని కుహుకుహూ కూతలతో అలరించాలని ఆశతో నగరంలోకి వచ్చిన రెండు కోయిలలు తమ కమ్మని కూతలను వినే మనుషులూ, తాము వాలడానికి చెట్లూ కనిపించక ఉస్సూరుమంటూ మాట్లాడుకుంటున్న ఈ కార్టూన్ లో వాస్తవ పరిస్థితి కళ్ళముందు కదలాడుతోంది.
గత రెండు దశాబ్ధాలుగా ఆంధ్రప్రభ పాఠకులను, కార్టూన్ ఇష్టులను అలరిస్తోన్న కార్టూన్ ఫీచర్, ఔరా.
