మొక్కజొన్నకు మద్దతు ధర లేక నష్టపోతున్న రైతులు

మొక్కజొన్నకు మద్దతు ధర లేక నష్టపోతున్న రైతులు
రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
ప్రభుత్వం మక్కలకు మద్దతు ధర చెల్లించి మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి
మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జీరో అవర్ లో ప్రసంగించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే మక్కల కొనుగోలు కంద్రాలు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా జీరో అవర్ లో రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యే ప్రసంగించారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 11లక్షల 72వేల ఎకరాలలో 10లక్షల మంది రైతులు మొక్కజొన్న సాగు చెస్తున్నారని తెలిపారు. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 3లక్షల 50వేల ఎకరాలలో మొక్కజొన్న సాగు అవుతుందని ఇది రాష్ట్రంలో 1/3వంతు ఉంటుం దని వెల్లడించారు. అయితే రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు పంటను అమ్ముకునేందుకు మద్దతు ధర లభించక ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 2400ఉం డగా వ్యాపారస్తులు మాత్రం 1600నుండి 1700 లకే కొనుగోలు చేయ డం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.
అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గతంలో కూడా మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. అందువల్ల వ్యవసాయ శాఖ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మద్దతు ధరతో మక్కలు కొనుగోలు చేసి మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
దీనిపై శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు స్పందిస్తూ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు అత్యంత ప్రముఖ్యత కలిగిన అంశం అని, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటును రాష్ట్ర ప్రభు త్వం పరిశీలిస్తోందని తెలిపారు. ఇప్పటికే సంబంధిత శాఖ మంత్రి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారని అందువల్లనే సభకు రాలేకపో యారని అన్నారు. తప్పకుండా మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్న రైతులకు మద్దతు ధర లభించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
