Ntr | డ్రాగన్ మూవీలో మార్పులు చేర్పులు..?

Ntr | డ్రాగన్ మూవీలో మార్పులు చేర్పులు..?
Ntr | ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ మార్పు..?
దేవిశ్రీ, థమన్ ట్రెండ్.. ఇప్పుడు ఎన్టీఆర్ మూవీకీనా..?
రవి బస్రూర్ ప్లేస్‌లో సాయి అభ్యంకర్..?
ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై కొత్త ప్రచారం
టాలీవుడ్‌లో పెరుగుతున్న మ్యూజిక్ డైరెక్టర్స్ మార్పుల ట్రెండ్
Ntr | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఒకప్పుడు సినిమాకి ముందుగా ఓ హీరోయిన్ అనుకోవడం.. ఆతర్వాత కొన్ని కారణాల వలన మరో హీరోయిన్ ఆ సినిమాలోకి రావడం అనేది అప్పుడప్పుడు జరుగుతుండేది. అయితే.. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ వంతు వచ్చింది. ముందుగా ఓ మ్యూజిక్ డైరెక్టర్ (Director) వర్క్ చేసిన తర్వాత మరో మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. పవన్ మూవీకికి జరిగింది.. ఇప్పుడు ఎన్టీఆర్ మూవీకి కూడా ఇలాగే జరగబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ.. ఎవరు ప్లేస్ లో ఎవరు రాబోతున్నారు..?

Ntr | దేవిశ్రీ, థమన్..
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవడం.. ఆయన గబ్బర్ సింగ్ మించేలా అద్బుతమైన సాంగ్స్ అందివ్వడం తెలిసిందే. అయితే.. ఈ సినిమాని మార్చి 26న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. మార్చి 19న రావాల్సిన టాక్సిక్ వాయిదా పడడంతో ఆ డేట్ కి ఉస్తాద్ రావాలని ఫిక్స్ అయ్యింది. అయితే.. ఒక వారం ముందుకు రావడంతో అనుకున్న టైమ్ కి రీ రికార్డింగ్ కంప్లీట్ చేయడం కోసం ఎస్ఎస్ థమన్ ని రంగంలోకి దింపారు. దేవిశ్రీ పాటలు అందించిన మూవీకి థమన్ రీ రికార్డింగ్ అందించారు. ఇది దేవిశ్రీకి నచ్చలేదే ఏమో కానీ.. ప్రీ రిలీజ్ (Pre Release) ఈవెంట్ కు దేవిశ్రీ, థమన్ ఇద్దరూ రాలేదు.

Ntr | రవి బస్రూర్, సాయి అభ్యంకర్..
ఎన్టీఆర్ మూవీ విషయానికి వస్తే.. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అయితే.. ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. కేజీఎఫ్ మూవీకి (Movie) రవి బస్రూర్ అద్భుతమైన సంగీతం అందించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో రవి బస్రూర్ కి మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రశాంత్ నీల్, రవి బస్రూర్.. ఇద్దరి మద్య మంచి అనుబంధం ఏర్పడింది. అయితే.. ఏమైందో ఏమో కానీ.. ఈ సినిమాకి రవి బస్రూర్ ని తప్పించి.. మరో మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ ను తీసుకోబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. దీంతో.. మ్యూజిక్ డైరెక్టర్స్ మార్పు అనేది ఇంకెన్ని సినిమాలకు జరుగుతాదో అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.


