అతను మా సంస్థ సభ్యుడే కాదు..

అతను మా సంస్థ సభ్యుడే కాదు..

మక్తల్ ఎంబి ఫీల్డ్ అసోసియేషన్ చైర్మన్ క్రిస్టోఫర్ మీసాల
మున్సిపల్ కమిషనర్ తహశీల్దార్ సిఐ లకు ఫిర్యాదు

మక్తల్ , ఆంధ్రప్రభ : మక్తల్ పట్టణంలో ఎంబి ప్రాపర్టీస్ అసోసియేషన్ తో రె.ఇ.ప్రసాద్ అనే వ్యక్తికి ఎలాంటి సంబందం లేదని సంస్థ నయమనిబంధనలకు వ్యతిరేకంగా చట్టబిరుద్ద పనులకు పాల్పడడం వల్ల అతడిని తమ సంస్థ నుండి 2022 లోనే తొలగించడం జరిగిందని మక్తల్ ఎంబి ఫీల్డ్ అసోసియేషన్ చైర్మన్ రె. క్రిస్టోఫర్ మీసాల స్పష్టం చేశారు.ఇ. ప్రసాద్ అనే వ్యక్తి తమ సంస్థ పేరుతో ఇటీవల మక్తల్ పట్టణంలోని రాయిచూర్ రోడ్డులో గల భూములపై అవి క్రిస్టియన్ ప్రాపర్టీ అంటూ మున్సిపల్ కమిషనర్ తహశీల్దార్ పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడని అన్నారు. అతనికి ఆ భూములకు సంబంధించి గాని మా సంస్థను కానీ ఎలాంటి సంబంధం లేదని తెలియజేస్తూ బుధవారం మున్సిపల్ కమిషనర్, తహశీల్దార్, సి ఐ లకు ఇతర సభ్యులతో కలిసి వినతిపత్రం అందజేశారు .

మా సంస్థ పేరుతో ఇ.ప్రసాద్ తో పాటు మరెవరైనా ఎలాంటి ఫిర్యాదులు చేసిన పట్టించుకోవద్దని తప్పుడుఫిర్యాదుగా భావించి సదరు వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన విన్నవించారు.20 24 నుండి డేవిడ్ తల్వార్ ఎంబి ఫీల్డ్ అసోసియేషన్ చైర్మన్గా నియమించడం జరిగిందన్నారు. 2025 ఎన్నికల ప్రకారం ఎంబి ప్రాపర్టీ అసోసియేషన్ యొక్క న్యాయ,పాక్షిక న్యాయస్థాయిలలో వివిధ ఆస్తి చట్టపరమైన సమస్యలు కొనసాగించడానికి బాలయ్య కుమారుడు సుదర్శన్ అడ్వకేట్ ను ప్రాపర్టీ చైర్మన్ గా నియమించడం జరిగిందన్నారు.ఇ. ప్రసాద్ అనే వ్యక్తి మరోసారి ఈ అంశంపై ఎలాంటి ఫిర్యాదులు చేసిన ప్రకటనలు చేసిన అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

బ్లాక్మెయిల్ చేయడం కోసమే ప్రసాద్ ఫిర్యాదులు…..

క్రిస్టియన్ ప్రాపర్టీస్ కు సంబంధం లేని సర్వే నంబర్ 936 ,941 భూములు భారత్ మాలలో పోవడం వల్ల ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడంతో సదరు ప్లాట్ లో కొనుగోలు చేసిన వ్యక్తులను బ్లాక్ మెయిల్ చేయడం కోసమే ఎంబి ప్రాపర్టీస్ పేరిట ఇ. ప్రసాద్ అనే వ్యక్తి అధికారులకు తప్పుడు ఫిర్యాదు చేశారని ఆయన పేర్కొన్నారు .ఎంబిపిఏ అనే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన భూమి 2009లో కోన వినోద్ కుమార్ అనే వ్యక్తి కొనుగోలు చేయడం జరిగిందన్నారు .కోన వినోద్ కుమార్ 2010 లో జి. బలరాం రెడ్డి ,కే .సూర్యనారాయణ గుప్తా అనే వ్యక్తులకు రిజిస్టర్ సేల్ డీడ్ ద్వారా విక్రయించడం జరిగింది.

ఆ భూమిలో ప్లాట్లు చేసి 2012లో 100కు పైగా ప్లాట్లను అమ్మడం జరిగింది.కోర్టు వారి అనుమతితో 2012లో దుకాణాలు ఇండ్ల నిర్మాణం జరిగిందన్నారు. ఈ భూమి కొనుగోలు చేసిన వారికి ఆర్ ఓ ఆర్ ,పాస్ బుక్, పహణీ , ధరణి, నాలా వంటి అన్ని పత్రాలు ఉన్నాయన్నారు. క్రిస్టియన్ సంస్థలకు ఏమాత్రం ఈ భూమితో సంబంధం లేదని తెలియజేశారు.ఇ. ప్రసాద్ అనే వ్యక్తి ఎంబి ప్రాపర్టీస్ పేరుతో బ్లాక్మెయిల్ చేయడం లక్ష్యంగా ఫిర్యాదు చేయడంతో మక్తల్ ఎంబి ఫీల్డ్ అసోసియేషన్ చైర్మన్ రె.క్రిస్టోఫర్ మీసాల అధికారులకు ఫిర్యాదు చేశారు.

Leave a Reply