ఎమ్మార్పీఎస్ నిరసన..

ఎమ్మార్పీఎస్ నిరసన..

ఆలేరు,ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో దళిత ఎమ్మెల్యే మందుల స్వామేల్ ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ బుధవారం నిరసన నిరసన కార్యక్రమం జరిగింది. దాడికి బిజెపి నైతిక బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు డిమాండ్ చేశారు.కార్యక్రమానికి మండల అధ్యక్షులు ముద్దేపాక కృష్ణ అధ్యక్షత వహించారు. రాష్ట్ర కార్యదర్శి భైరపాక నాగరాజు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంఘీ స్వామి, జిల్లా నాయకులు సురేష్, కందుల స్వామి, మండల అధికార ప్రతినిధి రామ్ చర్ల సిద్ధులు, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ముద్దేపాక రత్నాకర్,ముద్దేపాక శ్రీను, గ్యార సంపత్, గేదపాక యాదగిరి,అంజయ్య,సత్తయ్య, రమేష్ పాల్గొన్నారు.