అమ్మవారి పాదాలకు వెండి తొడుగు..
అమ్మవారి పాదాలకు వెండి తొడుగు..
కరిమాబాద్, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ శివనగర్ లోని మెట్ల బావి శ్రీ ధన మైసమ్మ దేవాలయం అమ్మవారికి 500 గ్రాముల వెండితో తయారుచేసిన పాదాలు సమర్పించడం జరుగుతుందని ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు తోట బాబన్న తెలిపారు. అమ్మవారికి దాతలు బహుకరించిన వెండితో అరకిలో వెండి పాదాల తొడుగుతయారు చేయించడం జరిగిందని ఈనెల 20న వేద బ్రాహ్మణుల మంత్రోత్సవాల మధ్యన అమ్మవారి పాదాలకు వెండి తొడుగు అమర్చడం జరుగుతుందని ఆయన తెలిపారు..ఈ పాదాలను ఉగాది తెలుగు నూతన సంవత్సరం 20-మార్చి శుక్రవారం రోజున ఉదయం జరిగే పూజలో అమ్మవారికి ఈ పాదాలకు సమర్పించడం జరుగుతుంది. వెండిని బహుకరించిన దాతలు తప్పకుండా కుటుంబ సమేతంగా, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధ్యక్షుడు తోట బాబన్న విజ్ఞప్తి చేశారు.
