ఉత్తమ సామాజిక సేవా అవార్డు అందుకున్న వర్కటం

ఉత్తమ సామాజిక సేవా అవార్డు అందుకున్న వర్కటం

మక్తల్, ఆంధ్రప్రభ : నిర్వి ఆర్ట్స్ వసుధ ఫౌండేషన్ హైదరాబాద్ వారి నుండి మక్తల్ నియోజకవర్గానికి చెందిన విజేఆర్ ఫౌండేషన్ అధినేత వర్కటం జగన్నాథ్ రెడ్డి దంపతులు ఉత్తమ సామాజిక సేవ అవార్డును అందుకున్నారు. మక్తల్ నియోజకవర్గానికి చెందిన వర్కటం జగన్నాథ్ రెడ్డి ఆయన సతీమతి వర్కటం అంజనా రెడ్డి విజెఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆ ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలోని ఏడు మండలాలలో పెద్ద ఎత్తున గత కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలను చేపట్టారు.

విద్యార్థులకు స్టడీ మెటీరియల్, కంప్యూటర్స్, డూఎల్ బేంచిలు , వాటర్ ట్యాంకులు వంటి సదుపాయాలను కల్పించారు. అదేవిధంగా గ్రామాలలో మంచినీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్న ప్రజలకు బోరు పైప్ లైన్ వేయించి మంచినీటి సమస్యను పరిష్కరించారు. విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహాయం అందించడం వంటి అనేక సేవా కార్యక్రమాలను కొనసాగించారు. దాదాపుగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని కొనసాగించారు. వర్కటం జగన్నాథ్ రెడ్డి విజెఆర్ ఫౌండేషన్ ద్వారా లబ్ధి పొందిన విద్యార్థులు వారు స్థిరపడ్డాక వారినీ కలిసి కృతజ్ఞతలు తెలిపిన సంఘటనలు ఉన్నాయి .

విజేఆర్ ఫౌండేషన్ చేపట్టిన సేవా కార్యక్రమాలను గుర్తించి హైదరాబాద్ లోని కోకాపేటలో ఓం కన్వెన్షన్ హాల్లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవం వేడుకల్లో దేశంలోని 100 మందిని ఎంపిక చేసి (రియల్ లైఫ్ సోషల్ హీరోస్ చేంజ్ మేకర్స్)పేరిట అవార్డులను ప్రధానం చేశారు. ఉత్తమ సామాజిక సేవ అవార్డు అందుకున్న సందర్భంగా వి జె ఆర్ ఫౌండేషన్ అధినేత వర్కటం జగన్నాథ్ రెడ్డి మాట్లాడుతూ నిర్వి ఆర్ట్స్ వసుధ ఫౌండేషన్ వారు తమ సేవలను గుర్తించి అవార్డు అందజేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు.

తనతో పాటు ఫౌండేషన్ డైరెక్టర్ అంజనా రెడ్డి కి ఉత్తమ సేవ అవార్డు అందజేశారన్నారు. వెనుకబడిన మక్తల్ ప్రాంతంలో తమ వంతు సేవా కార్యక్రమాలను ఇక ముందు కూడా కొనసాగిస్తామని విజెఆర్ ఫౌండేషన్ అధినేత వర్కటం జగన్నాథ్ రెడ్డి తెలిపారు.విజెఆర్ ఫౌండేషన్ అధినేత చేపట్టిన సేవా కార్యక్రమాలకు ఉత్తమ సామాజిక సేవ పురస్కారం లభించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply