RGV | నిజంగానే మారాడా..?

RGV | నిజంగానే మారాడా..?
RGV | రామ్ గోపాల్ వర్మ సంచలన నిర్ణయం
ట్రెండ్ సెట్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్
సర్కార్ సిరీస్ ప్రయాణం
సర్కార్ 4తో కమ్‌బ్యాక్ ప్లాన్
అమితాబ్, అభిషేక్ తో మళ్లీ జట్టు
వర్మ నుంచి మరో సంచలనం?
RGV | ఆంధప్రభ్ర వెబ్ డెస్క్ : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఒకప్పుడు తన సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లో సైతం.. తన మార్క్ చూపించారు. అయితే.. గత కొంతకాలంగా వర్మ నుంచి సరైన సినిమా రాలేదు. ఆయన కేవలం ట్వీట్ లకే పరిమితం అయ్యారు. ఇప్పుడు వర్మ షాక్ ఇవ్వబోతున్నారనే వార్త టాలీవుడ్, బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ.. వర్మ ఏం చేయబోతున్నారు..?
RGV | ట్రెండ్ సెట్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్..

శివ సినిమాతో టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఆతర్వాత రంగీల, సత్య, భూత్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ సాధించాడు. ఈమధ్య కాలంలో సినిమాల గురించి.. ఏఐ గురించి చెబుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. ఒకప్పుడు టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లో కూడా ట్రెండ్ సెట్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ తో సర్కార్ సినిమా తీసి సంచలనం సృష్టించాడు. 2005లో వర్మ సర్కార్ మూవీని తెరకెక్కించారు. మహారాష్ట్ర శివసేన అధినేత బాల్ థాకరే స్పూర్తితో అమితాబ్ క్యారెక్టర్ ని డిజైన్ చేయడంతో జనాలకు బాగా నచ్చింది.
RGV | సర్కార్ 4..

సర్కార్ తర్వాత సర్కార్ రాజ్ అని అమితాబ్, అభిషేక్ బచ్చన్ కాంబోలో తీసాడు. ఇది కూడా సక్సెస్ అయ్యింది. అయితే.. సర్కార్ రేంజ్ లో ఈ మూవీ సక్సెస్ సాధించలేదు. 2017లో సర్కా్ 3 అని తీసాడు. ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇదే సీక్వెల్ సిరీస్‌కు ముగింపు సినిమా అంటూ అంతా వర్మని విమర్శించారు. ఇక ఈ సిరీస్ కు ఎండ్ కార్డ్ పడినట్టు అనుకున్నారు. ఇప్పుడు సర్కార్ 4 తీస్తానంటున్నాడు వర్మ. ఈ సినిమాతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని తపిస్తున్నాడట. అమితాబ్, అభిషేక్ తో ఏప్రిల్ 4న ఈ మూవీని స్టార్ట్ చేయబోతున్నాడని టాక్. వర్మ ఏది చేసినా సంచలనమే. మరి.. ఈ సినిమాతో ఏ రేంజ్ లో షాక్ ఇస్తాడో చూడాలి.
