కడెం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య శిబిరం…
కడెం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య శిబిరం…
పలు వైద్య నిపుణుల డాక్టర్లచే వైద్య పరీక్షలు
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో ప్రజాపాలన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం ప్రత్యేక వైద్య నిపుణులచే వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని పెద్దూర్ కడెం గ్రామ సర్పంచ్ దీకొండ విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ స్వర్ణ రెడ్డి గైనకాలజిస్ట్ డాక్టర్ శశి, జనరల్ మెడిసిన్ డాక్టర్ సాయి పీడియాట్రిషన్ డాక్టర్ అరవింద్ డెంటల్ డాక్టర్ ప్రమోద్ రెడ్డి ఆర్తో ఆప్తమాలజిస్ట్ డాక్టర్ రామ్ రెడ్డి వేరువేరు విభాగాలుగా రోగులను పరీక్షించి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.
ప్రభుత్వం ఇలాంటి ప్రత్యేక సేవలు అందించడం అభినందనీయమని పెద్దూర్ కడెం గ్రామ సర్పంచ్ డి కొండ విజయకుమార్ కొనియాడారు. ఇలాంటి మరిన్ని అందించాలని అయన ఆకాంక్షించారు. ఈ ఈ సందర్భంగా వైద్య శిబిరానికి వచ్చిన వైద్యులకు స్థానిక సర్పంచ్ దికొండ విజయకుమార్ శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పిట్టల రాజన్న జిపి వార్డు సభ్యులు నాయకులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

