బ్యాంకులకు వరుస సెలవులు..

బ్యాంకులకు వరుస సెలవులు..
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మార్చి నెల అంటే.. లెక్కలు చూసుకునే సమయం.. అలాగే ఆర్ధిక ఒత్తిడులు ఎక్కువుగా ఉంటాయి. ఇలాంటి కీలక సమయంలో బ్యాంకులకు వరుసగా సెలవులు రావడంతో జనాల్ని కాస్త టెన్షన్ కి గురి చేస్తోంది. వచ్చే వారం నుంచి మార్చి 22 వరుకు మధ్య కాలంలో వివిధ ప్రాంతాల్లో బ్యాంకులు నాలుగు రోజులు మూతపడనున్నాయి. ఇంతకీ.. ఈ సెలవులు దేనికి అంటారా..?
ప్రాంతీయ పండగలు, జాతీయ సెలవులు కలిసి రావడంతో ఈ పరిస్థితి వచ్చింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రకటించిన జాబితా ప్రకారం.. మార్చి నెలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సహా అన్ని బ్యాంకులకు మొత్తం 18 రోజులు సెలవులు ఉన్నాయి. ఇందులో వారాంతపు శని, ఆదివారాలు కూడా కలిసి ఉన్నాయి. సాధారణంగా నెలలోని మొదటి, మూడవ శనివారాల్లో బ్యాంకులు పని చేస్తాయి. కానీ ఈసారి పండుగలు వారాంతాలకు సమీపంలో రావడంతో వరుసగా సెలవులు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ముఖ్యంగా మార్చి 19న ఉగాది. ఇది తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండుగ. తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్, విజయవాడ నగరాల్లోని అన్ని బ్యాంకులు ఆ రోజు పని చేయవు. అలాగే బెంగళూరు, చెన్నై, ముంబై వంటి ప్రధాన నగరాల్లో కూడా గుడి పడ్వా, ఉగాది వేడుకల వల్ల సెలవు ప్రకటించారు. దీని వల్ల దక్షిణ భారతదేశంలో బ్యాంకింగ్ కార్యకలాపాలకు కొంత అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఉగాది మాత్రమే కాకుండా రంజాన్ సందర్భంగా కూడా వరుస సెలవులు ఉన్నాయి. మార్చి 20న ఈద్ ఉల్ ఫితర్ కారణంగా సెలవు. 21న దేశ వ్యాప్తంగా రంజాన్ సెలవు ఉంటుంది. 22 ఆదివారం ఎలాగో సాధారణ సెలవు. ఇలా.. వరుసగా బ్యాంకులు సెలవులు రావడం వలన నగదు ఉపసంహరణ, చెక్కుల క్లియరెన్స్ కు ఆటంకం కలగవచ్చు. అందుచేత బ్యాంక్ బ్రాంచ్‌లకు వెళ్లి పూర్తి చేయాల్సిన పనులు ఉంటే ఈ వారమే పూర్తి చేసుకోవడం మంచిది.
