శామీర్ పేట ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం

శామీర్ పేట ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం

ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి

శామీర్ పేట, ఆంధ్రప్రభ : శామీర్ పేట ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం శామీర్ పేట పరిధిలోని ఔటర్ రింగ్ పై మద్యం మత్తులో ఉన్న కంటైనర్ లారీ డ్రైవర్ ఆగి ఉన్న కారును బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

స్థానికుల వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.. మేడ్చల్ నుండి శామీర్పేట్ వైపు వెళ్తున్న కారు శామీర్పేట్ ఎగ్జిట్-7 వద్ద ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఆగింది. కారులో ప్రయాణిస్తున్న కొంతమంది వ్యక్తులు కారును పక్కకు నిలిపి వెనకాల నిలబడి భోజనం చేస్తుండగా, వేగంగా వచ్చిన కంటైనర్ లారీ అదుపుతప్పి కారును బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారు వెనకాల ఉన్న ఇద్దరు వ్యక్తులు మహమ్మద్ యూసుఫ్ ఖాన్ (51), నివాసం ఆర్టీసీ కాలనీ మౌలాలి, మహమ్మద్ హుస్సేన్ (48) నివాసం షేక్ పేట, వారు టీ ఎస్ 09 ఈడి 3303 నెంబర్ గల ఆడి కారులో ఈసీఐఎల్ నుండి తుప్రాన్ వైపు ఓఆర్ఆర్ పై వెళ్తున్న మార్గమధ్యలో శామీర్ పేట లిమిట్స్ లో కారు ఆపి భోజనం చేస్తుండగా ఎంహెచ్ 12 పిక్యూ 2337 నెంబర్ గల అశోక్ లీలాండ్ లారీ వేగంగా వచ్చి కారును దికొట్టిందని పోలీసులు తెలిపారు.

ఈ ప్రమాదంలో కారు వెనుకాల ఉన్న ఇద్దరు సంఘటన స్థలంలోనే మృతి చెందారని తెలిపారు. పోలీసులు మృదేహాలను పోస్ట్ మార్టంకై ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ పరిక్షా నిర్వహించగా అతను మద్యం సేవించి వాహనం నడిపినట్లు తెలిందని పోలుసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు శామీర్ పేట పోలీసులు తెలిపారు.

Leave a Reply