జనహిత సేవా సమితి సేవలు ప్రశంసనీయం
జనహిత సేవా సమితి సేవలు ప్రశంసనీయం
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : ఆపదలో ఉన్న ప్రతి పేదవాడికి అండగా నిలుస్తూ, సామాజిక బాధ్యతతో జనహిత సేవా సమితి అందిస్తున్న సేవలు ఎంతో ప్రశంసనీయమని మున్సిపల్ చైర్‌పర్సన్ దావా స్వాతి-రమేష్ కొనియాడారు. సోమవారం పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒకవైపు ఆకలితో అలమటిస్తున్న పేదలకు అన్నదానాలు చేస్తూ, మరోవైపు వేసవిలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం సమితి సేవా నిరతికి నిదర్శనమన్నారు.
సామాజిక సేవలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న జనహిత సభ్యుల కృషి అభినందనీయమని తెలిపారు. సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ.. పదేళ్ల క్రితం చలివేంద్రం ఏర్పాటుతో ప్రారంభమైన తమ ప్రస్థానం, దాతల సహకారంతో నేడు అనేక సేవా కార్యక్రమాల విస్తరణకు వేదికైందని పేర్కొన్నారు. కేవలం చలివేంద్రాలే కాకుండా, అన్నదానాలు, నేత్రదానాలు, విద్యార్థులకు అవసరమైన తోడ్పాటు అందిస్తూ పేదల చెంతన ఉంటున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రాగంశెట్టి సత్యనారాయణ, కౌన్సిలర్లు, జనహిత సభ్యులు పాల్గొన్నారు.
