ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి…

ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి…
రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి
మక్తల్, ఆంధ్రప్రభ : ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని తమకు చేతనైనంత ఇతరులకు సహాయం అందించడం గొప్ప వరంగా భావించాలని రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. ఇవాళ నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని గాంధీ చౌక్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు బురాన్ ఆధ్వర్యంలో 30 మంది మున్సిపల్ వర్కర్లకు బట్టల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి బురాన్ తో కలిసి మున్సిపల్ వర్కర్లకు బట్టలు పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ప్రత్యేకంగా నిరుపేదలకు తనవంతు సహాయం అందజేస్తున్న బురాన్ ను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. సేవ చేయడం కూడా అదృష్టంగా భావించాలని అన్నారు. ఇచ్చే శక్తి గుణం ఉన్నప్పటికీ తీసుకునే వారు కూడా ఉంటేనే దానం చేసే అవకాశం లభిస్తుందన్నారు. రంజాన్ మాసంలో దానం చేయడం అనేది గొప్ప అవకాశం గా భావిస్తారని గత కొంతకాలంగా బురాన్ ఈ కార్యక్రమం చేపట్టడం ఎంతో అభినందనీయమని అన్నారు.

30 మందికి బట్టలు పంపిణీ చేయడం పట్ల ప్రత్యేకంగా మంత్రి బురాన్ ను అభినందించారు .రంజాన్ పండుగను ప్రతి ఒక్కరు భక్తిశ్రద్ధలతో సంతోషాల మధ్య ఘనంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సూచించారు .ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస హన్మంతు, 13వ వార్డు కౌన్సిలర్ సరిత గోవింద్ రావు ,కాంగ్రెస్ నాయకులు కట్టా సురేష్ కుమార్ గుప్తా, గోవిందరావు, గోవర్ధన్,కావలి తాయప్ప, వల్లంపల్లి లక్ష్మణ్,ఎఎంసి డైరెక్టర్ అంజి తదితరులు పాల్గొన్నారు.
