బండి వెంకటరెడ్డికి తాలూకా పగ్గాలు…

బండి వెంకటరెడ్డికి తాలూకా పగ్గాలు…

వనపర్తి టౌన్, ఆంధ్రప్రభ : ఆదివారం కొల్లాపూర్ తాలూకా పరిధిలో రెడ్డి సేవా సమితి కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో తాలూకా అధ్యక్షుడిగా బండి వెంకటరెడ్డిని నియమించారు. ఉపాధ్యక్షులుగా గాదెల సుధారాణి, తలకంటి అచ్యుతారెడ్డి, బీరం భాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా గంగిరెడ్డి బుచ్చారెడ్డి, సహాయ కార్యదర్శులుగా కేశిరెడ్డి వెంకటరమణారెడ్డి, చల్లా భాస్కర్ రెడ్డి, కోశాధికారిగా గోవిందు జగదీశ్వర్ రెడ్డి, గౌరవ అధ్యక్షులుగా గంగుల దామోదర్ రెడ్డిని నియమించారు.

తాలూకా నలుమూలల నుంచి రెడ్డి సోదరులు సమావేశంలోపాల్గొని ఉత్సాహంగా ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బండి వెంకటరెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచిన రెడ్డి సోదరులకు, అలాగే సహాయ సహకారాలు అందిస్తున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఉద్యోగి వెంకట్ రంగారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

సామాజిక వర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రతి నెల ఒక సమావేశం నిర్వహించి రెడ్డి సోదరుల సమస్యలను తెలుసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమం ఉమ్మడి పాలమూరు జిల్లా రెడ్డి సేవా సమితి అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, వనపర్తి జిల్లా అధ్యక్షులు నారాయణరెడ్డి, ఎద్దుల ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన జరిగినట్లు తెలిపారు.

Leave a Reply