పంటల ఉత్పత్తి పై నైపుణ్యం, అభివృద్ధి, మద్దతు సేవలపై శిక్షణ

పంటల ఉత్పత్తి పై నైపుణ్యం, అభివృద్ధి, మద్దతు సేవలపై శిక్షణ
పరకాల, ఆంధ్రప్రభ : రైతుల పంటల ఉత్పత్తులపై నైపుణ్యం, అభివృద్ధి, మద్దతు సేవలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శనివారం రోజు పరకాల మండలం నాగారంలోని రైతు వేదిక లో ఆత్మ వారి సౌజన్యం తో రైతు ఉత్పత్తి దారుల సంస్థలకు సమర్థ్య పెంపుదల నైపుణ్య అభివృద్ధి, మద్దతు సేవల పై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాకతీయ రైతు ఉత్పత్తిదారుల సంస్థ సీఈఓ , పసిడి పంట సంస్థ కో ఆర్డినేటర్ శ్రీనివాస రావు , రైతులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో భాగంగా పరకాల వ్యవసాయ అధికారి ఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఏర్పాటుకు సహకరించిన పసిడి పంట సంస్థ బయోచార్ వినియోగం పై రైతులకు అవగాహన కల్పించి బయోచార్ సేంద్రియ కార్బనాన్ని పెంచి భూమిలో నత్రజని భాస్వరం , పొటాషియం పోషకాలను భూమిలోనే పంటకు అందేలా ఉపయోగపడుతుందని ,చౌడు భూముల్లో భూమిని సారవంతం చేస్తుందని చెప్పినారు.
బయోచార్ ఆకులను కండలను మన పంట వ్యత్యాలను ఆక్సిజన్ లేకుండా పైరవలిసిస్ అనే ప్రక్రియ ద్వారా బొగ్గు లాగా చేసిన వ్యర్థాలను భూమిలో వాడినచో భూమి సారవంతమైతుందని రైతులకు తెలియజేశారు. అలాగే రైతులు కోయకాలను కాల్చడం ద్వారా భూమిలో కలిసిన వ్యర్ధాలు భూమి సారవంతం చేయకుండా, కాలుష్యానికి పెంచడం వాతావరణం హాని కలిగిస్తుంది. బయో ఆచార్ వాడడం రైతులకు ఉపయోగపడుతుందని వివరించారు. పసిడి పంట సంస్థ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ రైతు క్షేత్రంలో బయోచార్ వాడిన క్షేత్రానికి రైతులను తీసుకువెళ్లి వారికి బయోచార్ వాడిన భూమిలో పంటను, వాడని పంటను ఒక వ్యత్యాసం చూపించి రైతులకు అవగాహన కల్పించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో బయోచార్ వినియోగం నర్సరీ ద్వారా ఎఫ్ పి ఓ చేపట్టిన కార్యక్రమాలు వాటి ద్వారా మిర్చి నారు పెంపకం దాని మార్కెటింగ్ వివరాలను రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకతీయ రైతు ఉత్పత్తిదారుల సంస్థ 25 మంది రైతులు పసిడి పంట సంస్థ కో ఆర్డినేటర్, సిహెచ్ శ్రీనివాస్ , పరకాల మండల వ్యవసాయ అధికారి ఎస్ శ్రీనివాస్, ఏఈఓ అహ్మద్ రజా, రైతులు పాల్గొన్నారు.
