కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా 12 సంవత్సరాలు పూర్తి
కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా 12 సంవత్సరాలు పూర్తి
- ఆలయంలో బిజెపి నాయకులు ప్రత్యేక పూజలు
పరకాల, ఆంధ్రప్రభ : భారత ప్రధాని నరేంద్ర మోదీ 4,399 రోజుల విజయవంతమైన సుపరిపాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మరియు జిల్లా శాఖల పిలుపు మేరకు పరకాల పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
పరకాల పట్టణ బీజేపీ అధ్యక్షులు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పరకాల శ్రీ భవాని కుంకుమేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం మరియు భారతదేశ ప్రగతి మరింతగా కొనసాగాలని ప్రార్థనలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధి, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలను నాయకులు ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు హాజరై మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో విశేష పురోగతి సాధించిందని అన్నారు. భారతదేశ ప్రతిష్ఠ ప్రపంచవ్యాప్తంగా పెరిగిందని, అభివృద్ధి మరియు సుపరిపాలనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.
అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చి “డబుల్ ఇంజిన్ సర్కార్” ఏర్పడటం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.పి. జయంతీ లాల్, పరకాల మున్సిపల్ కౌన్సిలర్లు కుక్కల విజయ్ కుమార్, బెజ్జంకి పూర్ణాచారి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ చందుపట్ల రాజేందర్ రెడ్డి, నాయకులు కాచం గురు ప్రసాద్, ఎర్ర రామన్న, పట్టణ ప్రధాన కార్యదర్శి సంఘ పురుషోత్తం, జిల్లా నాయకులు కొలనుపాక భద్రయ్య, మెంతుల సురేష్, బాసాని సోమరాజు, సూర్యదేవర సదానందం, కానుగుల గోపీనాథ్, సారంగ నరేష్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
