విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

విద్యుత్ పోలెక్కిన కౌన్సిలర్…


మేడ్చల్, మార్చి 13(ఆంధ్రప్రభ) : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరంగవరం పట్టణంలో శ్రీ రంగనాయక స్వామి భవాని రామలింగేశ్వర స్వాముల వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా విద్యుత్ అధికారులకు బీఆర్ఎస్ పార్టీ 17వ వార్డు కౌన్సిలర్ అధికారులను కలిసి వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కోరారు.

అయితే అధికారులు స్పందించకపోవడంతో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కౌన్సిలర్ స్వయంగా విద్యుత్ పోల్ ఎక్కి వీధి దీపాలు వెలిగేవిధంగా మరమ్మత్తులు చేశారు. కౌన్సిలరే స్వయంకృషితో వీధి దీపాలు వెలిగేలా ప్రయత్నం చేసి ఆ సమస్యను పరిష్కరించాడు. సమస్య పరిష్కారం కావడంతో ఎల్లంపేట మున్సిపల్ 17వ వార్డు కౌన్సిలర్ దాది నరసింహను స్థానిక ప్రజలు అభినందించారు.

Leave a Reply