Allu Cinemas | బన్నీ ఎందుకిలా చేశాడు..?

Allu Cinemas | బన్నీ ఎందుకిలా చేశాడు..?

Allu Cinemas | అల్లు సినిమాస్‌లో దర్శకుల ఫోటోలు.. ఇద్దరు డైరెక్టర్లు మిస్సింగ్
శంకర్ ఫోటో లేకపోవడంతో మొదలైన చర్చ
పాన్ ఇండియా సినిమాలకు మార్గం చూపిన దర్శకుడు శంకర్
పోకిరితో ట్రెండ్ సెట్ చేసిన పూరి జగన్నాథ్
అల్లు సినిమాస్‌పై పెరుగుతున్న విమర్శలు
తప్పును సరిదిద్దుకుంటుందా అల్లు సినిమాస్?

Allu Cinemas | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అల్లు సినిమాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ మల్టీప్లెక్స్ లో.. లెజెండరీ దర్శకుల ఫోటోలు పెట్టారు. ఇందులో ఇద్దరు దర్శకుల ఫోటోలు మిస్ అయ్యాయి. ఆ ఇద్దరు దర్శకుల ఫోటోలు ఖచ్చితంగా ఉండాలి కానీ.. లేకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. అనుకోకుండా జరిగిందా..? లేక కావాలనే ఆ ఇద్దరు దర్శకుల ఫోటోలు పెట్టలేదా అనే చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ దర్శకులు ఎవరు..? అసలు ఎందుకు ఇలా చేశారు..?

Allu Cinemas | శంకర్ ఫోటో ఏమైంది..

Allu Cinemas

అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ లో.. తెలుగు దర్శకులతో పాటు తమిళ, హిందీ దర్శకుల ఫోటోలు కూడా పెట్టారు. అలాగే సపరేట్ గా దాసరి, రాఘవేంద్రరావు, కె.విశ్వనాథ్, బాలచందర్ ఫోటోలు కూడా పెట్టారు. అయితే.. ఇండియన్ సినిమా ఫ్రైడ్ దర్శకుల లిస్ట్ లో మణిరత్నం, రాజమౌళి, సుకుమార్, రాజు హిరానీ, ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి.. ఇలా చాలా మంది ఫోటోలు దర్శనమిచ్చాయి. బాగానే ఉంది కానీ.. ఇండియన్ సినిమాకి ముఖ్యంగా సౌత్ సినిమాలకు మంచి గుర్తింపు.. టెక్నాలిజీని జనాలకు పరిచయం చేసిన శంకర్ ఫోటో పెట్టకపోవడంతో విమర్శలు వస్తున్నాయి.

Allu Cinemas | రాజమౌళినే..

Allu Cinemas

శంకర్ ఓ సంచలనం. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అంటున్నారు కానీ.. ఆయన ఎప్పుడో పాన్ ఇండియా సినిమాలు చేసారు. భారీ బడ్జెట్, భారీ తారాగణంతో సినిమాలు అందించారు. సౌత్ సినిమా సత్తాను ఇండియన్ సినిమా సత్తాని ప్రపంచానికి చాటి చెప్పారు. అలాంటి డైరెక్టర్ ఫోటో పెట్టకపోవడం ఇప్పుడు వివాదస్పదం అవుతుంది. ఇప్పుడు ఇండియా నెంబర్ 1 డైరెక్టర్ రాజమౌళినే.. మా అందరికీ ఓజీ అంటే గ్యాంగ్ స్టర్ శంకర్ గారు అని ఓ సందర్భంలో చెప్పారు. దీనిని బట్టి ఆయన రేంజ్ ఏంటో.. ఆయన క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Allu Cinemas | ఇండియాలో మరో పూరి లేడు..

Allu Cinemas

ఇక మరో డైరెక్టర్ అంటే.. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఆయన కూడా ఇప్పుడు ప్లాపుల్లో ఉండచ్చు కానీ.. తెలుగు సినిమా సత్తాను పోకిరి సినిమాతో ప్రపంచానికి చూపించారు. ఇప్పటికీ మహేష్ బాబు పోకిరి సినిమా తనని మార్చిందని.. స్టార్ హీరోని చేసిందని చెబుతుంటారు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్ వ్యూలో కూడా మహేష్.. పూరి పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ప్రభాస్ అయితే.. ఓపెన్ గా ఇండియాలోనే పూరిలా రాసే డైరెక్టర్ మరోకరు లేరని స్టేట్మెంట్ ఇచ్చాడు. టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లో అమితాబ్ తో కూడా పూరి సినిమా తీసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆయన ఫోటో కూడా పెట్టకపోవడం పై విమర్శలు వస్తున్నాయి. మరి.. అల్లు సినిమాస్.. జరిగిన తప్పును సరిదిద్దుకుంటుందేమో చూడాలి.

Leave a Reply