అవి.. రోడ్డు మీద పారయ్యొద్దు..

అవి.. రోడ్డు మీద పారయ్యొద్దు..

ములకలపల్లి, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని మూకమామిడి గ్రామపంచాయతీలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం అన్ని దుకాణదారులుతో సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కోర్సా ఆదిలక్ష్మి మాట్లాడుతూ.. దుకాణాలలో పాడైపోయిన వ్యర్ధాలు రోడ్డుమీద పడేయొద్దని వాటిని సంచులలో ఎత్తి డంపింగ్ యార్డ్ దగ్గర పడేయాలని లేదా పంచాయతీ ట్రాక్టర్ గ్రామాలలో వచ్చినపుడు అందులో వేయాలని సూచించారు. మాంసం, చేపల వ్యర్థాలను దుకాణదారులు డంపింగ్ యార్డ్ దగ్గర పడేయాలని దుకాణదారులకు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ కేసుపాక శ్రీనివాసరావు, వార్డు మెంబర్ భూక్య అశోక్, బచ్చల చైతన్య కుమారి, ఆశ వర్కర్ గుగులోత్ జ్యోతి, కొడిమె వనిత, సున్నం లక్ష్మి, అంగన్వాడి టీచర్ వేప విజయ, దుకాణదారులు అద్దంకి రమేష్, అనంతుల నిర్మల, చిట్టి సత్యనారాయణ, అనంతుల వీరస్వామి, సీమకుర్తి కిషోర్, పంచాయతీ సిబ్బంది కొరసా వెంకటేష్, కొండ్రం శ్రీను, గడ్డం వెంకటేష్, కుంజా నగేష్, సున్నం శ్రీను, బత్తుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply