ముగా జీవాలకు టీకాలు తప్పనిసరి వేయించాలి…
జుక్కల్, ఆంధ్రప్రభ ; పాడి రైతులు అందరు మూగజీవాలకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను తప్పనిసరి వేయించాలని డోన్ గాం గ్రామసర్పంచ్ ఖానాపూరే శ్రీనివాస్ అన్నారు. జుక్కల్ పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గురువారం ఉచిత టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించడమే కాకుండా, పశువులకు గాలికుంటు నిరోధక టీకాలు వేశారు.
అవులకు,దూడలకు బర్రెలకు,గేదెలతో పాటు ఆయా రకాల ముగాజీవాలను గాలికుంటు వ్యాధి నుంచి రక్షించవలసిన అవసరం మన అందరిపై ఉందని, పశువైద్య శాఖద్వారా ఏప్రిల్ 9 వరకు గ్రామాలవారిగా కొనసాగే ఇట్టి టీకాల కార్యక్రమాన్ని పశువుల పెంపకందారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ ఖనపురే శ్రీనివాస్ అన్నారు.
పాడి రైతులు తప్పనిసరి తమ పశువులను టీకాలు వేయించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పశు వైద్య ఉద్యోగులతో పాటు గోపాల మిత్రలు రాములు,అంజయ్య, రవీందర్,పాడిరైతులు పాల్గొన్నారు.
