డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో..

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో..

ఊర్కొండ, ఆంధ్రప్రభ : మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ఓ వ్యక్తికి జైలు శిక్షతో పాటు జరిమానా, మరో నలుగురికి జరిమానా విధిస్తూ న్యాయాధికారి తీర్పు ఇచ్చారని ఊర్కొండ ఎస్ఐ కృష్ణదేవ తెలిపారు. కొద్దిరోజుల క్రితం మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ఐదుగురి పై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. పట్టుపడ్డ వారిలో మండల కేంద్రానికి చెందిన మహేష్ మూడు రోజుల జైలు శిక్షతో పాటు రూ.600 జరిమానా, అలాగే ఆంజనేయులకు రూ.700, పర్వతాలుకు రూ. 1000, కృష్ణయ్యకు రూ.900, బాలయ్యకు రూ.1000. జరిమానా విధిస్తూ కల్వకుర్తి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ న్యాయాధికారి కావ్య తీర్పునిచ్చారని ఎస్సై కృష్ణదేవ పేర్కొన్నారు.

Leave a Reply