POLICE | మత్తుకు దూరంగా ఉండాలి..
POLICE | మత్తుకు దూరంగా ఉండాలి..
POLICE | డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరం కలిసి పోరాడాలి
పిల్లలపై తల్లిదండ్రులు నిత్యం పర్యవేక్షణ చేయాలి
డ్రగ్స్‌తో పాటు సెల్‌ఫోన్‌లకు బానిసలు కాకండి
హెల్మెట్, సీట్‌బెల్ట్‌తోనే ప్రమాదాలకు అడ్డుకట్ట
సైబర్ క్రైమ్‌లపై ఫిర్యాదులకు 1930కు కాల్ చేయండి
డ్రగ్స్ సమాచారాన్ని 1908కు తెలియజేయండి
పాఠశాలల వద్ద సిగరెట్ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటాం
యువత భవిష్యత్తు కాపాడటం అందరి బాధ్యత
POLICE | స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : డ్రగ్స్ అనే సామాజిక వ్యాధిని నిర్మూలించాలంటే ప్రజలు, తల్లిదండ్రు లు, ఉపాధ్యాయులు, పోలీసు శాఖ అందరూ కలిసికట్టుగా పనిచేయా లని జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ పిలుపునిచ్చారు. తెలంగా ణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వరంగల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఘన్‌పూర్ పట్టణ కేంద్రంలోని మా గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం స్టేషన్ ఘన్‌పూర్ సీఐ జి. వేణు అధ్యక్షతన ఓ యువత మేలుకో…డ్రగ్స్ మానుకో అనే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పట్టణ కూడళ్ళలో ప్రజాప్రతి నిధులు, విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ హాజరై మాట్లాడారు. రాఘవాపూర్, ఇప్పగూడెం, పాంనూర్ గ్రామాల్లో డ్రగ్స్ వ్యతిరేక అవ గాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. డ్రగ్స్‌కు డిమాండ్ ఉన్న చోటే అవి ఎక్కువగా వ్యాపిస్తాయని పేర్కొ న్నారు. ముఖ్యంగా పిల్లలు, యువత డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదం డ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లలు ఎటు వెళ్తున్నా రు..ఎవరితో తిరుగు తున్నారు అనే విషయాలను గమనించడం తల్లి దండ్రుల బాధ్యత అని అన్నారు. అదే విధంగా విద్యార్థుల ప్రవర్తనలో ఏదైనా అనుమానం కలిగితే ఉపాధ్యాయులు వెంటనే స్థానిక ఎస్‌హెచ్‌ఓకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

డ్రగ్స్‌తో పాటు సెల్‌ఫోన్‌లకు కూడా బానిసలు కాకూడదు :
డ్రగ్స్‌తో పాటు సెల్‌ఫోన్‌లకు కూడా యువత బానిసలు కాకూడదని డీసీపీ పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో పోలీసు శాఖ సిబ్బంది సైబర్ క్రైమ్, డ్రగ్స్ ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ తరాలు సమాజానికి బాధ్యత గల పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. సైబర్ క్రైమ్‌లు పెరుగుతున్న నేపథ్యంలో అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే 1930 నెంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 100, బాలల సమ స్యల కోసం 1098 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. డ్రగ్స్ అమ్మ కాలు లేదా కొనుగోళ్లపై సమాచారం ఉంటే 1908 నెంబర్‌కు తెలియజే యాలని చెప్పారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి :
రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని డీసీపీ సూచించారు. తెలంగాణలో హత్యల కంటే రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది మరణిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి తన తండ్రి హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పించాలని సూచించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్ల ప్రమాదం జరిగితే ఒక వ్యక్తి మాత్రమే కాదు..మొత్తం కుటుంబం నష్టపోతుందని అన్నారు. ఆశా వర్కర్లు, సబ్ సెంటర్ సిబ్బంది, ఎక్సైజ్ శాఖ, పోలీసు సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అలాగే పాఠ శాలల పరిసరాల్లో 100 మీటర్ల దూరంలో సిగరెట్ దుకాణాలు ఉండ కూడదని తెలిపారు. 18 సంవత్సరాల లోపు వారికి సిగరెట్లు విక్రయిం చినట్లు తెలిసితే కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని డీసీపీ హెచ్చరించారు.

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్క రూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. అనం తరం ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు, యువతతో డ్రగ్స్ నిర్మూలనపై డీసీపీ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, తహసీల్దార్ వెంకటేశ్వ ర్లు, ఎస్ఐ మనీషా, వైద్యాధికారి అజయ్ కుమార్, మండల విద్యాశాఖ అధికారి కొమురయ్యతో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. మున్సి పల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ ఎస్ఐ మనీషా, వైద్యాధికారి అజయ్ కుమార్, మండల విద్యాశాఖ అధికారి కొమురయ్యతో పాటు అన్ని శాఖల అధికారులు, కౌన్సిలర్ లు, విద్యార్థులు తదిత రులు పాల్గొన్నారు.
