Gold Prices Fall గోల్డ్ ఇన్వెస్టర్లకు షాక్. Andhra Prabha Spl News

Gold Prices Fall గోల్డ్ ఇన్వెస్టర్లకు షాక్. Andhra Prabha Spl News
- 7 రోజుల్లో భారీ టర్నోవరు
- ప్రపంచంలో ఊగిసలాట
- పెరిగిన డాలర్ బలం..
- బంగారం అమ్మకాల ఒత్తిడి
- ప్రాఫిట్ బుకింగ్ ప్రభావం
- ₹1.73 లక్షల నుంచి పతనం..
- యుద్ధంతోనే ఈ భయం
( ఆంధ్రప్రభ, బిజినెస్ డెస్క్)

నేడు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు అనూహ్యంగా తగ్గాయి. యుద్ధ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, అమెరికా డాలర్, పెరిగిన ముడి చమురు ధరల ప్రభావంతో బంగారంపై పెట్టుబడులు తగ్గాయి. అంతర్జాతీయ ధర: అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర సుమారు 1.3% నుంచి 1.7% వరకు క్షీణించి, దాదాపు $5,082 – $5,090 వద్ద ట్రేడవుతోంది. భారతదేశంలో ఎంసీఎక్స్ (MCX) మార్కెట్‌లో బంగారం ధర 10 గ్రాములకు సుమారు ₹1,367 (0.9%) తగ్గి, ₹1,60,267 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹1,63,640 నుంచి ₹1,61,680 – లకు చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹1,50,000 ల నుంచి ₹1,48,200 లకు చేరింది.
Gold Prices Fall : 7 రోజుల్లో భారీ టర్నోవరు
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బంగారం మార్కెట్‌లో లావాదేవీలు భారీగా పెరిగాయి. గడిచిన వారంలో భారతీయ మార్కెట్లలో (MCX & Retail) రికార్డు స్థాయి టర్నోవరు నమోదైంది. యుద్ధం మొదటి వారంలోనే ధరలు ₹1.73 లక్షల వరకు పెరగడంతో ఇన్వెస్టర్లు భారీగా క్రయవిక్రయాలు జరిపారు. కేవలం కొన్ని సెషన్లలోనే టర్నోవరు సాధారణం కంటే 40-50% పెరిగినట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Gold Prices Fall : ప్రపంచంలో ఊగిసలాట

అంతర్జాతీయంగా బంగారం ట్రేడింగ్ వాల్యూమ్ (Volume) రోజుకు సగటున 1,48,500 నుంచి 3,00,000 కాంట్రాక్టుల మధ్య ఊగిసలాడుతోంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్, LBMA నివేదికల ప్రకారం, గత వారం రోజుల్లో ప్రపంచవ్యాప్త ఓవర్-ది-కౌంటర్ (OTC) మరియు ఎక్స్ఛేంజ్ ట్రేడింగ్ వాల్యూమ్ రోజుకు సగటున $180 బిలియన్ల నుంచి $220 బిలియన్ల మధ్య ఉన్నట్లు అంచనా.
Gold Prices Fall : ధరల పతనం ఎందుకు?

అమెరికా డాలర్ విలువ గత మూడు నెలల గరిష్టానికి చేరడంతో ఇతర కరెన్సీలు ఉన్న దేశాలకు బంగారం కొనుగోలు ఖరీదైనదిగా మారింది. ప్రాఫిట్ బుకింగ్: మార్చి మొదటి వారంలో ధరలు విపరీతంగా పెరగడంతో ఇన్వెస్టర్లు తమ లాభాలను వెనక్కి తీసుకుంటున్నారు . చమురు ధరలు $115 దాటడంతో ద్రవ్యోల్బణ భయాలు పెరిగి, అది ఫెడ్ వడ్డీ రేట్లపై ప్రభావం చూపుతుందనే ఆందోళన బంగారంపై ఒత్తిడిని పెంచింది.
ALSO READ : Asian Markets Crash : ₹100 లక్షల కోట్లు మటాష్ Andhra Prabha Spl Story
