Women | కెవికెలో మహిళా దినోత్సవ వేడుకలు

Women | కెవికెలో మహిళా దినోత్సవ వేడుకలు
Women | ఘంటసాల, ఆంధ్రప్రభ : ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం వారి ఆధ్వర్యంలో కెవికెలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కెవికె సమన్వయకర్త డా. డి.సుధారాణి, మాట్లాడుతూ ప్రతి మహిళా సాధికారిక సాధికారిత వైపు అడుగులు వేయాలని, ముఖ్యంగా వ్యవసాయ, అనుబంధ రంగాల్లో పురోగతినీ, స్వయం సమృద్ధిని సాధించి ప్రగతి బాటలో ముందడుగు వేయాలని కోరారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఘంటసాల మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట కనకదుర్గ మాట్లాడుతూ ప్రతి మహిళా వారు ఎన్నుకున్న రంగాల్లో ఉన్నతంగా ఎదగాలని, ప్రగతి పథంలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అతిధిగా విచ్చేసిన వేమన చందన గారు ఘంటసాల ఎస్సై, మాట్లాడుతూ సమాజంలోని మహిళలు ధైర్యంగా జీవించాలని, చదువులోనూ వృత్తిలోనూ, వివిధ సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొని తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు.
ఘంటసాలపాలెం గ్రామ సర్పంచ్ దోనే రజిని మాట్లాడుతూ… మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ఓర్పు సహనంతో పని చేస్తూ విజయాన్ని విజయాలు సొంతం అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిధులు, మహిళా వ్యాపారవేత్తలను కెవికె తరఫున సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కెవికె శాస్త్రవేత్తలు జి.కృష్ణవేణి, డా. కే.రేవతి, డా.ఎం వెంకటలక్ష్మి, జె.యశ్వంత్ కుమార్, డా.బి. నవీన్, మహిళలు పాల్గొన్నారు.
