sachin| చీర‌క‌ట్టులో సారా టెండూల్కర్

sachin| చీర‌క‌ట్టులో సారా టెండూల్కర్

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు, లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు అర్జున్ టెండూల్కర్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలైన సానియా చందోక్‌‌ను వివాహం చేసుకున్నాడు. గురువారం ముంబైలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ పెళ్లి వేడుక‌లో వధువు సానియా చందోక్ కంటే ఆమె వదిన, అర్జున్ టెండూల్కర్ సోదరి సారా టెండూల్కర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చీరకట్టులో సారా అతిలోక సుంద‌రిలా క‌నిపించింది. పెళ్లిలో పింక్ కలర్ వర్క్ సారీలో కనిపించిన సారా.. మెడలో దగదగ మెరిసే నగల వెలుతురులో రాకుమారిలా కనిపించింది. సారాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వధువు కంటే వదినే అందంగా ఉందని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు

Leave a Reply