మామిళ్లపల్లిలో అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు

మామిళ్లపల్లిలో అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు

బండలాగుడు పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లి గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా అంతర్రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సాయంత్రం ప్రారంభించారు. దేవస్థాన కమిటీ చైర్మన్ వేముల నరసింహారావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా ఎడ్ల జత యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సాయంత్రం డ్రా తీయగా పోటీలకు వచ్చిన జతలను విభాగాల వారీగా ఎంపిక చేశారు. సీనియర్ విభాగంలో విజేతలకు ఆకర్షణీయమైన నగదు బహుమతులను ప్రకటించారు. మొదటి బహుమతి రూ.1,00,000, రెండో బహుమతి రూ.80,000, మూడో బహుమతి రూ.60,000, నాలుగో బహుమతి రూ.40,000, ఐదో బహుమతి రూ.20,000 గా నిర్ణయించారు. బహుమతి పొందని ప్రతి జతకు కన్సొలేషన్ బహుమతిగా రూ.5,000 ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలను చూడటానికి పరిసర గ్రామాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply