Home | ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం సకాలంలో చేపట్టండి.

Home | ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం సకాలంలో చేపట్టండి.

Home | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు నిర్మించాలని లక్ష్యంతో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుందని లబ్ధిదారులు సకాలంలో నిర్మాణపనులుపూర్తిచేయాలని గృహనిర్మాణ శాఖ ఏఈ ప్రేమ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు డి. యజ్ఞేశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసిసూర్యప్రకాశ్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఎం. భరత్ అన్నారు. గురువారం నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీలో ఇందిరమ్మ ఇంటినిర్మాణానికిభూమిపూజ చేశారు. అంతకుముందు లబ్ధిదారు శారదా భానుచందర్ కు గృహ నిర్మాణ మంజూరుపత్రంపంపిణీచేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడితే ప్రభుత్వ లక్ష్యం నెరవేరడంతో పాటు లబ్ధిదారులకు సొంతింటికల సహకారమవుతుందనిఅన్నారు. ఇండ్ల నిర్మాణం చేపడుతున్న లబ్ధిదారులకు ఉచిత ఇసుక సరఫరాతో పాటు బిల్లులు దశలవారీగా వారి బ్యాంకు ఖాతాలోజమచేస్తున్నట్లు పేర్కొన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుందని మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరిసహకారంతో ఊట్కూర్ మండలానికి అధికంగా ఇండ్లు మంజూరు చేయిస్తామని అన్నారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొక్కులింగం, పంచాయతీ సిబ్బంది పోలప్ప, నాయకులు కొక్కులక్ష్మణ్, భక్కితిమ్మప్ప, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply