శభాష్ సర్పంచ్ పురుమాని కోమల!

శభాష్ సర్పంచ్ పురుమాని కోమల!
- గ్రామాభివృద్ధి పట్ల కట్టుబాటు!
- నమిలిగొండలో మెయిన్ రోడ్డు సమస్యకు సత్వర పరిష్కారం
స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్పూర్ మండలంలోని నమిలిగొండ గ్రామంలో ప్రజా ప్రతినిధుల చురుకుదనం స్పష్టమైంది. గ్రామంలోని 2వ వార్డులో నెలకొన్న మెయిన్ రోడ్డు సమస్యకు సత్వర స్పందన లభించడంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు చాలా రోజులుగా ఎదుర్కొం టున్న రోడ్డు ఇబ్బందులను గుర్తించిన వార్డు మెంబర్ దాసి రాజు వెంట నే ఈ విషయాన్ని సర్పంచ్ పురుమాని కోమల ఐలోని దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకున్న సర్పంచ్ ఆలస్యం చేయకుండా చర్యలు ప్రారంభించారు. వెంటనే రోడ్డుపై మొర్రం పోయించి ప్రయాణా నికి అనుకూలంగా మార్చి తాత్కాలిక పరిష్కారం కల్పించారు. గ్రామా భివృద్ధిపై సర్పంచ్ చూపుతున్న శ్రద్ధకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ పురుమాని కోమల ఐలోని మాట్లాడుతూ..గ్రామాభి వృద్ధే మా ప్రధాన లక్ష్యం. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే నా దృష్టికి తీసుకువస్తే స్పందించి పరిష్కారం కోసం కృషి చేస్తాను.
నమి లిగొండ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నిరం తరం శ్రమిస్తానని తెలిపారు. ప్రజల సమస్యలపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడం ప్రజా ప్రతినిధుల బాధ్యత అని ఆమె పేర్కొన్నా రు. సమస్యల పరిష్కారంలో వేగంగా స్పందిస్తూ గ్రామ ప్రజల నమ్మ కాన్ని నిలబెట్టుకున్న సర్పంచ్‌కు గ్రామస్థులు శభాష్ అంటున్నారు. గ్రామ అభివృద్ధి దిశగా ఇలాగే ముందుకు సాగాలని కోరుతున్నారు.
