Iran, Israel | PIJ కమాండర్ అబూ హమ్జా మృతి

Iran, Israel | PIJ కమాండర్ అబూ హమ్జా మృతి
Iran, Israel | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. తాజాగా.. లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది. ఈ ఘటనలో పీఐజే(పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్) కమాండర్ అబూ హమ్జా మృతి చెందినట్టు తెలుస్తోంది.
హమ్జాను హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం అధికారికంగా ప్రకటించింది. బీరుట్ దక్షిణ శివారు ప్రాంతంలోని హిజ్బొల్లా అనుబంధ అల్-మనార్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ రక్షణ దళాలు హెచ్చరికలు జారీ చేసిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది.
