పిఓడబ్ల్యూ సీపీఐ నాయకులు అరెస్ట్. ఎందుకో తెలుసా..?

పిఓడబ్ల్యూ సీపీఐ నాయకులు అరెస్ట్. ఎందుకో తెలుసా..?

వికారాబాద్, ఆంధ్రప్రభ : లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వికారాబాద్ విచ్చేస్తున్న నేపథ్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు వై గీత, సీపీఐ ఎంఎల్, నాయకులు మహేందర్ ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. రాహుల్ గాంధీని అడ్డుకుంటారన్న సమాచారంతో పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసినట్టు సమాచారం. ఎస్ఏపీ కళాశాలలో హెలిపాడ్ నుండి అనంతగిరి హరిత రిసార్ట్ వరకు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్డు మార్గాన రానున్నారు. ఈ మార్గంలో వివిధ పార్టీల నాయకులు అడ్డుకునే అవకాశం ఉన్నందున వీరిని ముందస్తు అరెస్ట్ చేసినట్టు తెలిసింది.

Leave a Reply