నీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్

నీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్

జైనూర్,ఆంధ్రప్రభ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని రావుజి గూడ పొలాస గ్రామ పంచాయతీలోని ముస్లిం గూడలో గత 20 ఏళ్లుగా నీటి ఎద్దడి సమస్య ను నూతన యువ సర్పంచ్ జాదవ్ బాహు రావు నూతన బోర్వెల్ వేయించి నీటి సమస్యను తీర్చాడు. ముస్లిం గూడలో ప్రతి ఏడాది వేసవికాలంలో నీటి ఎద్దడి సమస్య తీవ్రంగా ఉండేదని, తాను సర్పంచ్ గా గెలిచిన వెంటనే అధికారులతో మాట్లాడి ఆ గ్రామంలో 600 మీటర్ల లోతు బోరు వేయించిన తర్వాత ఆ బోర్లు మీరు వచ్చిందని ఆయన తెలిపారు.

సంవత్సరాల తరబడి పోలాస ముస్లిం గూడ లోని ప్రజలకు నీటి సమస్య తీరడంతో ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. పంచాయతీలో ఏ సమస్యలు ఉన్న పరిష్కరించే విధంగా కృషి చేస్తానని నూతన సర్పంచ్ జాదవ్ బాహు రావు తెలిపారు.

Leave a Reply