పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
నాగర్ కర్నూల్, ఆంధ్ర ప్రభ: 1981 82 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జాతీయోన్నత పాఠశాల నాగర్ కర్నూల్ లో చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జాతీయ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థుల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పూర్వ విద్యార్థి అయిన ఆర్ సత్యం అధ్యక్షతన ఘనంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మొదటగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించి సభను ప్రారంభించారు. సభలో పాఠశాల గురువులైన అబ్దుల్లా ఖాన్, సాంబయ్య, సుందరాచారి, శ్రీమతి శాంతమ్మ, అటెండర్ నరసింహను శాలువాలతో మెమొంటోలతో సత్కరించి ధన్యవాదాలు తెలియజేశారు.
పాఠశాలలో వల్ల విద్యాబుద్ధులు క్రమశిక్షణ నేర్చుకుని వివిధ పనులలో వృత్తులలో ఉద్యోగాలలో స్థిరపడి జీవనం సాగిస్తున్నామని ఈ పాఠశాలను ఎల్లప్పుడూ మరచిపోలేమని కొనియాడారు పూర్వ విద్యార్థులు. తమ పాఠశాలలో పాఠశాలలో చదువుకున్న అనుభూతులను అనుభవాలను తీపి జ్ఞాపకాలను స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ అద్వితీయమైన అనుభూతిని పంచుకొన్నారు. పాఠశాల వ్యవస్థాపకులైన మాజీ మంత్రి పుట్టపాక మహేంద్రనాథ్ ఏర్పరచిన పాఠశాల ఈ పాఠశాల వేలాదిమంది విద్యార్థులను తయారు చేసిందని ఆ కాలంలో బడుగు బలహీన వర్గాల పేద మధ్యతరగతి రైతుల పిల్లలు చదువుకోవడానికి పాఠశాల తో పాటు హాస్టల్లో ఏర్పాటు చేసి విద్య నేర్పిన ఘన చరిత్ర కలిగిన ఈ జాతీయోన్నత పాఠశాల అని కొనియాడారు.
అభివృద్ధి కొరకు తమ శాయశక్తుల సహకారాన్ని అందిస్తామని దీనికి పూర్వవైభవాన్ని తీసుకురావాలని ఈ కార్యక్రమంలో మహేంద్రనాథ్ గారి మనవడు పుట్టపాగ రాఘవ మాట్లాడుతూ ఈ పాఠశాలను వచ్చేలో ఇంగ్లీష్ విద్య ఏర్పాటు చేస్తామని ఏర్పాటు చేస్తామని వచ్చే రెండు మూడు సంవత్సరాలలో పూర్వ వైభవాన్ని చేయడానికి కృషి చేస్తానని మీ అందరి సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల పాఠశాల ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు హెచ్ రవి ఉపాధ్యాయులు వహీద్ ఖాన్ జి మురళీధర్ రావు విశ్వేశ్వరయ్య లను కూడా ఈ సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులైన మొలిశెట్టి నరసింహ కందికొండ మోహన్ పుట్టపాక వెంకట్ స్వామి కందూరు బాలాజీ వజ్రమ్మ కుసుమ లక్ష్మీ కుమారి దాదాపుగా 70 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు
