రూ. 1 లక్ష ఆర్థిక సహాయం….

రూ. 1 లక్ష ఆర్థిక సహాయం….

మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన చెన్నగోని కాటంరాజు ఇటీవల జరిగిన గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసి ఓటమితో మానసికంగా కృంగిపోయి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ రోజు కాటంరాజు కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కుటుంబానికి రూ.1,00,000 ఆర్థిక సహాయం ప్రకటించారు. భవిష్యత్తులో కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మునుగోడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సురిగి నరసింహ గౌడ్, వార్డ్ మెంబర్లు మహేశ్వరం భరత్ కుమార్, నిరుడు శేఖర్ ముదిరాజ్, సురిగి మైసూర్, కందుల రవికుమార్, పాలుట్ల ప్రేమ్ కుమార్, ఈరటి చెన్నయ్య యాదవ్, నూతన కంటి లింగస్వామి, శ్రీను, నందిపాటి లక్ష్మయ్య, పాలెం వెంకటేష్, ఉమ్మెత్తలా శివప్రసాద్, ఉమ్మెత్తలా సాయికిరణ్, అరురీ మాసయ్య, జాజుల సాయికుమార్, మహేశ్వరం నవీన్, బబ్లు, ప్రభాకర్, జాజుల చిన్న లింగస్వామి, సురిగి లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply