Ranabaali | దటీజ్.. విజయ్ దేవరకొండ, రష్మిక..

Ranabaali | దటీజ్.. విజయ్ దేవరకొండ, రష్మిక..
Ranabaali | విజయ్ దేవరకొండ – రశ్మిక మందన్న కృతజ్ఞతల సందేశం
దేవాలయాల్లో అన్నదానం.. స్వీట్స్ పంపిణీ
రణబాలి వెడ్డింగ్ సాంగ్ రిలీజ్
పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రణబాలి
సెప్టెంబర్ 11న గ్రాండ్ రిలీజ్
Ranabaali | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వైవాహిక జీవితంలోకి తాము అడుగుపెట్టిన సందర్భంగా.. మనస్ఫూర్తిగా ఆశీస్సులు అందించిన దేశ ప్రజలకు కృతజ్ఞత తెలిపారు విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంట. వారి పై తమ ప్రేమను చూపించేందుకు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోని దేవాలయాల్లో అన్నదానం, స్వీట్స్ పంపిణీ చేస్తున్నట్లు విరోష్ ప్రకటించారు. ఈ రోజు తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, చండీగఢ్, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ, కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరి, బిహార్ లోని పలు నగరాల్లో అన్నదానం, స్వీట్స్ పంపిణీ చేయనున్నారు.

Ranabaali | దేవాలయాల్లో అన్నదానం..
ఈ ప్రకటనలో విరోష్ స్పందిస్తూ.. మా జీవిత ప్రయాణంలో ఈ దేశ ప్రజలందరూ ఒక భాగమే. మా వివాహం సందర్భంగా మీరంతా చూపించిన ప్రేమకు, అందించిన ఆశీస్సులకు కృతజ్ఞతలు. ఈ సంతోషమైన సందర్భాన్ని మీతో కలిసి సెలబ్రేట్ (Celebrate) చేసుకునేందుకు మీ అందరికీ స్వీట్స్ పంపిస్తున్నాము. వివిధ నగరాల్లోని దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మీ ఆశీస్సులు ఎప్పుడూ మాపై ఉండాలి అని అన్నారు.

Ranabaali | బ్యూటిఫుల్ వెడ్డింగ్ సాంగ్..
ఇక సినిమా విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. అంగరంగ వైభవంగా జరిగిన వారి పెళ్లి వేడుక గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ.. రణబాలి మూవీ టీమ్ ఈ చిత్రంలోని బ్యూటిఫుల్ వెడ్డింగ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ భారీ పాన్ ఇండియా మూవీలో విజయ్ (Vijay) రణబాలిగా, రశ్మిక జయమ్మ పాత్రల్లో కనిపించనున్నారు. రణబాలిలో వీరి పెళ్లి వేడుక సందర్భంగా ఓ అందమైన పాట చిత్రీకరించారు. ఈ పాటలో అప్పట్లో పెళ్లి సందడి ఎంత సంప్రదాయంగా ఉండేదో చూపించారు. పసుపు దంచడం, గోరింటాకు రుబ్బడం, ఎద్దు బండి సవారీలో నూతన వధూ వరులను తీసుకురావడం, అత్తవారింట్లో నవ వధువు శుభప్రదంగా అడుగుపెట్టడం.. ఇవన్నీ ఎంతో అందంగా ఈ పాటలో రూపొందించారు.
Ranabaali | సెప్టెంబర్ 11న రణబాలి..
ఈ పాట ఎలా ఉందో చూస్తే.. ఎందయ్య సామీ.. అంటూ సాగే ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్స్ అజయ్ – అతుల్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రణబాలి సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రణబాలి సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ (Release) కు రాబోతోంది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ హ్యూజ్ రెస్పాన్స్ అందుకుంది. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రణబాలి సినిమా రూపొందుతోంది.


