మున్సిపల్ చైర్మన్ పావని రమేష్ గౌడ్ కు పరామర్శ..

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మామ మొగుదాల స్వామి గౌడ్ ఇటీవల మరణించిన విషయం తెలుసుకున్న డిసిసిబి మాజీ డైరెక్టర్ పిల్లలమర్రి శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా ఉపాధ్యక్షులు దోనూరు రాంరెడ్డి లు చైర్ పర్సన్ ఇంటికి వెళ్లి స్వామి గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చైర్ పర్సన్ పావని రమేష్ గౌడ్ దంపతులను, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో 19వ వార్డు కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్, జర్నలిస్టు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, షాది ఖానా చైర్మన్ కరీం, మాజీ చైర్మన్ ఇంతియాజ్ పాష, మేరు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గంగాపురం శ్రీనివాస్, లెక్చర్ రేఖల వెంకటేశం, నాయకులు తొర్పునూరి నరసింహ, పాండు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply