మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ అరెస్ట్..

మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ అరెస్ట్..
- రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలింపు
- కేసు వివరాలు, సెక్షన్లు వెల్లడించని పోలీసులు
మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : మెదక్ మున్సిపల్ మాజీ ఛైర్మెన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్ ను శనివారం తెల్లవారుజామున మెదక్ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చోటుచేసుకున్న ఘటన పై నమోదైన కేసుల్లో హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ మంజూరయ్యింది. కాగా శనివారం తెల్లవారుజామున పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మల్లిఖార్జున్ గౌడ్ ను అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక బిఆర్ఎస్ నేతలు రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలివెళ్లారు. అయితే ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారు, ఏ సెక్షన్లు నమోదు చేశారనే వివరాలను పోలీసులు వెల్లడించడం లేదని, పోలీస్ స్టేషన్ లోనికి ఎవరిని అనుమతించడం లేదని బిఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు.
