apcm 5formulae : ఇక 5 సూత్రాల సేధ్యం Andhra Prabha Assembly

apcm 5formulae : ఇక 5 సూత్రాల సేధ్యం Andhra Prabha Assembly

  • జీడీపీలో 10 శాత ఏపీదే
  • రైతుల‌కు ఉచిత విద్యుత్తు
  • ప‌కృతి సేధ్యం పెరిగింది
  • హార్టిక‌ల్చ‌ర్ హ‌బ్ గా. రాయ‌ల‌సీమ
  • ఏలూరు అతి పెద్ద కోకో సిటీ
  • ఆక్వాక‌ల్చ‌ర్ కు అండాదండ‌
  • వ్య‌వ‌సాయాన్ని దెబ్బ‌తీశారు
  • గృహ‌నిర్మాణంలో అన్నీ అవ‌క‌త‌వ‌క‌లే
  • ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్ర‌బాబు

( ఆంధ్ర‌ప్ర‌భ‌, వెల‌గ‌పూడి ప్ర‌తినిధి)

apcm 5formulae : నీటి భద్రత, గిరాకీ ఆధారిత పంటలు, ఫుడ్ ప్రాసెసింగ్, మార్కెటింగ్, ప్రభుత్వ మద్దతు అనే పంచసూత్రాల విధానాన్ని వ్య‌వసాయం రంగం అభివృద్దికి అమలు చేస్తున్నాం, అని ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అన్నారు వ్యవసాయం, అనుబంధ రంగాలు, హౌసింగ్ రంగాల్లో బడ్జెట్ పద్దుపై శుక్ర‌వారం శాసనసభలో ఆయ‌న మాట్లాడుతూ, జాతీయ స్థూల ఉత్పత్తిలో 10 శాతం మేర వ్యవసాయం నుంచి ఏపీ కంట్రిబ్యూట్ చేస్తోంది . వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి 22.5 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. ఈ ఏడాది 69 వేల కనెక్షన్లు కొత్తగా ఇచ్చాం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.13,722 కోట్లు కేటాయించాం. 1250 టన్నుల మైక్రో న్యూట్రియెంట్లను కూడా వ్యవసాయానికి సరఫరా చేశాం. అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేల మొత్తాన్ని రైతులకు మూడు విడతల్లో ఇస్తున్నాం. గతంలో రూ.7500 మాత్రమే రైతులకు ఇచ్చారు. దానికి రెండింతలు మేర రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.14 వేలు ఇస్తున్నాంజ 47 లక్షల మంది రైతులకు రూ.310 కోట్లు పంటనష్టపోయిన రైతులకు పెట్టబడి రాయితీ ఇచ్చాం. రూ.10,816 కోట్ల మేర 24 గంటల్లో ధాన్య కొనుగోళ్ల కోసం రైతులకు చెల్లించాం. గత పాలకులు రైతులకు చెల్లించాల్సిన రూ.1670 కోట్ల ధాన్యం బకాయిలు కూడా మేమే చెల్లించాం. అని సీఎం చంద్ర‌బాబు వివ‌రించారు.

apcm 5formulae : రైతుల ఆత్మ‌హ‌త్య‌ల నియంత్ర‌ణే ల‌క్ష్యం

రైతు ఆత్మహత్యలు కూడా ఆ ప్రభుత్వ హయాంలో జరిగాయి.
ఇప్పుడు వాటిని నియంత్రించేలా ప్రతీ ఘటననూ ఆడిట్ చేయించేలా నిర్ణయం తీసుకున్నాం. వ్యవసాయ యాంత్రీకరణ పెద్ద ఎత్తున తీసుకురావటంతో పాటు ఏఐ ఆగ్రానమిస్టు సేవలు కూడా అందేలా చేస్తాం. 14,230 కోట్ల మేర ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి, అని సీఎం అన్నారు.

apcm 5formulae ప‌కృతి సేధ్యం పెరుగుతోంది

apcm 5formulae

వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్‌ పై పెద్ద ఎత్తున దృష్టి పెట్టాం. 8,168 గ్రామాల్లో 15 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారు. త్వరలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేసేలా ప్రోత్సాహం ఇస్తున్నాం వెయ్యి మిలియన్ టన్నుల మేర ఉత్పత్తి అయ్యేలా లక్ష్యంగా పనిచేస్తున్నాం.క్లస్టర్ విధానం ద్వారా ప్రభుత్వం రూ.30 వేల కోట్లతో ఈ ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం, సీఎం చెప్పారు.

apcm 5formulae : \రాయ‌ల‌సీమ ఇక హార్జిక‌ల్చ‌ర్ హ‌బ్

apcm 5formulae

ప్రైవేటు రంగంలో మరో 70 వేల కోట్లతో మొత్తం లక్ష కోట్ల మేర పెట్టుబడులతో రాయలసీమను ఉద్యాన హబ్ గా తయారు చేస్తాం. ఏలూరు వద్ద ప్రపంచంలోనే అత్యంత పెద్ద కోకో సిటీ ఏర్పాటు చేస్తాం. రూ.1.50 కే యూనిట్ విద్యుత్ ఇచ్చి అక్వా రంగాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తున్నాం. ఏపీ ఆక్వా కల్చర్ హబ్‌గా తయారు అవుతుంది, అని సీఎం చంద్ర‌బాబు అన్నారు. .

apcm 5formulae : వ‌ర్ష‌పాతం త‌గ్గొచ్చు

ఈసారి కొంతమేర వర్షపాతం తగ్గే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి
నీటి భద్రతపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాం. అన్నమయ్య జిల్లాలో సమర్ధ నీటి నిర్వహణ ద్వారా 6.67 మీటర్లకు భూగర్భ జలాలు పెరిగాయి . ప్రస్తుతం రాష్ట్రంలో సగటున 7.31 మీటర్ల మేర భూగర్భ జలాలు ఉన్నాయి. భూగర్భ జలాలు పెరిగిన కారణంగా రూ.95 కోట్ల మేర విద్యుత్ ఆదా అయ్యింది. 20 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు కూడా పెరిగాయి. రూ.1634 కోట్ల మేర జీఎస్డీపీ కూడా పెరిగింది సాగునీటి సంఘాలు కూడా ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాలని సీఎం చంద్ర‌బాబు పిలుపు ఇచ్చారు. రైతులకు పూర్తిగా అండగా నిలుస్తాం. కౌలు రైతులను కూడా ఆదుకునేలా చర్యలు చేపడుతున్నాం

apcm 5formulae : హౌనింగ్ లో అన్నీ అక్ర‌మాలే

apcm 5formulae

గత పాలకులు హౌసింగ్ లో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. ఇసుక విధానాన్ని కూడా అస్తవ్యస్తం చేసి అవినీతికి పాల్పడ్డారు. ఈ అక్రమాల్లో భాగస్వాములైన వారిని చట్టపరంగా శిక్షిస్తాం, అని సీఎం చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. 2.20 లక్షల కుటుంబాలకు ఇంటి జాగాలు లేవు. వారందరికీ పట్టణ ప్రాంతాల్లో అయితే 2, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్లు ఉచితంగా కేటాయిస్తాం. అందరికీ ఇళ్లు ఇవ్వాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం 3 లక్షల ఇళ్ల నిర్మాణాలను రాయచోటి నుంచి ప్రారంభించాం. ఈ ఏడాది ఉగాదిలోగా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు చేయిస్తాం. జూన్‌కు 2.26 లక్షలు, సెప్టెంబరులో 2.10 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు జరిగేలా కార్యక్రమం చేపట్టాం, అని సీఎం వివ‌రించారు.

apcm 5formulae : 10 ల‌క్ష‌ల ఇళ్ల‌ల్లో.. గృహ‌ప్రవేశాలు ల‌క్ష్యం

మొత్తంగా ఈ ఏడాదిలో 10.63 లక్షల ఇళ్లలో గృహ ప్రవేశాలు చేయిస్తాం. ఇళ్లు రాని వాళ్లంతా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ ఇళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాయి. గత పాలకులు చేసిన తప్పును సరిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. త్వరలోనే దీనిపై కార్యాచరణ చేపడతాం. 2029లోగా పేదలందరికీ ఇళ్లు కట్టించటంతో పాటు ఉచితంగా ఇంటి స్థలాలు కూడా ఇస్తామని సీఎం భరోసా ఇచ్చారు.

ALSO READ : cops under cage : ఐపీఎస్ ప‌క్షులు Andhara ptabha

Leave a Reply