వైసీపీ నేత బుర్రి బాబురావుకు నివాళులు..

వైసీపీ నేత బుర్రి బాబురావుకు నివాళులు..

  • పార్టీకి తీరని లోటు
  • వైసిపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్
  • కుటుంబానికి అండగా ఉంటామని హామీ

విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ తూర్పు నియోజకవర్గం 19వ డివిజన్‌కు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బుర్రి బాబురావు హఠాత్ మరణం పట్ల వైసీపీ నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పార్థివ దేహానికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, సీనియర్ నాయకుడు కడియాల బుచ్చిబాబు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ బుర్రి బాబురావు పార్టీ అభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివని, ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై బాబురావుకు చివరి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Leave a Reply