తడి, పొడి చెత్తను వేరువేరుగా అందించాలి

తడి, పొడి చెత్తను వేరువేరుగా అందించాలి

  • డిఎల్పిఓ రజావుల్లా

అవనిగడ్డ – ఆంధ్రప్రభ : అవనిగడ్డ మండలం పులిగడ్డ గ్రామ పంచాయితీలో మచిలీపట్టణం డివిజినల్ పంచాయితీ అధికారి షైక్ రజావుల్లా గురువారం పర్యటించారు. డిప్యూటీ ఎంపిడిఓ డి.చంద్రశేఖరరావు, పంచాయితీ కార్యదర్శి బట్టు అనితతో కలిసి పులిగడ్డ గ్రామ పంచాయితీ పరిధిలో చెత్త నుండి సంపద తయారి కేంద్ర నిర్వహణ, పారిశుధ్య పనుల నిర్వహణ, ఇంటిపన్ను, నీటిపన్నుల నిర్వహణపై ప్రజల యెక్క అబిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.

గ్రామములోని ప్రజలకు తడి, పొడి చెత్త మీద అవగహన కల్పించారు. అలాగే ప్రతి రోజు మీ గ్రామములో చెత్త సేకరణ జరుగుంతుందా లేదా అని ప్రజల వద్ద నుండి తెలుసుకున్నారు. ప్రజలు కూడా మంచు అబిప్రాయాన్ని తెలియపరిచారు.

Leave a Reply