సురక్షితంగా వాహనాలను నడపాలి..

సురక్షితంగా వాహనాలను నడపాలి..
అర్లీ ఎక్స్ రోడ్ సమీపంలోని వాహనాల తనిఖీ చేపట్టిన కుంటలు ఎస్సై ఎం అజయ్
కుంటాల, ఆంధ్రప్రభః ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుతూ కుంటాల ఎస్సై ఎం అజయ్ అన్నారు. 61వ జాతీయ నిర్మల్ బైంసా రహదారిపై గల అర్లి ఎక్స్ రోడ్ అదేవిధంగా లింబ బి సమీపంలోని సమీపంలోని వాహనాల తనిఖీ బుధవారం రోజు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై ఎం అజయ్ మాట్లాడుతూ రోడ్డు భద్రత ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు రక్షణ ఉంటుందన్నారు. వాహన పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని మద్యం సేవించి వాహనాలు నడపకూడదని మద్యం సేవించి వాహనాలు నడుపుతే చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.
అర్లీ ఎక్స్ రోడ్ సమీపంలోని కార్ లోని ప్రయాణిస్తున్న వారికి సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలని సీటు బెల్టుతో ఎన్నో ప్రాణాలు బయటపడతాయని అతివేగ మూలంగా ప్రాణాలు గాలిలో కాల్చిపోయే అవకాశాలు ఉన్నాయని ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు తప్పనిసరిగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ జీవన్ రావు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
