Line man dead : ప‌ల్నాడులో విషాదం Andhra Prabha News

Line man dead : ప‌ల్నాడులో విషాదం Andhra Prabha News

  • ఆర్టీసీ బస్సు ఢీకొ\ని లైన్‌మెన్ మృతి
  • అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు వీడిన‌ రాజారత్నం
  • విద్యుత్ శాఖలో విషాద ఛాయలు

(నకరికల్లు, ఆంధ్రప్రభ)

పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలో విషాదం చోటుచేసుకుంది. బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విద్యుత్ శాఖలో గుండ్లపల్లి లైన్‌మెన్‌గా పనిచేస్తున్న జూపల్లి రాజారత్నం (40) అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నకరికల్లుకు చెందిన రాజారత్నం గుండ్లపల్లి గ్రామంలో లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం ఆయన నరసరావుపేట నుండి తిరిగి నకరికల్లు వస్తుండగా, పిడుగురాళ్ల నుండి నరసరావుపేట వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆయన ప్రయాణిస్తున్న బైక్‌ను బలంగా ఢీకొట్టింది.ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో రాజారత్నం ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. విధి నిర్వహణలో ఉంటూ ఇలా అకాల మరణం చెందడంతో రాజారత్నం కుటుంబంలో మరియు విద్యుత్ శాఖలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Leave a Reply